Lyrics: తరలిరాద తనే వసంతం తన దరికిరాని వనాల కోసం - Tarali rada tane vasantham Lyrics in Telugu

Taralirada thane vasantham lyrics
Taralirada song lyrics telugu

తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం

తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం

గగనాల దాక.. అల సాగ కుంటే మేఘాల రాగం.. ఇల చేరుకోద

తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం

వెన్నెల దీపం.. కొందరిదా అడవిని సైతం.. వెలుగు కదా వెన్నెల దీపం.. కొందరిదా అడవిని సైతం.. వెలుగు కదా

ఎల్లలు లేని.. చల్లని గాలి అందరి కోసం.. అందును కాదా ప్రతి మదిని లేపే.. ప్రభాత రాగం పదే పదే చూపే.. ప్రధాన మార్గం ఏది సొంతం కోసం.. కాదను సందేశం పంచే గుణమే పోతే.. ప్రపంచమేశూన్యం ఇది తెలియని మనుగడ కథ.. దిశ లెరుగని గమనము కద

తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం

బ్రతుకున లేనీ.. శ్రుతి కలదా ఎద సడి లోనే.. లయ లేదా బ్రతుకున లేనీ.. శ్రుతి కలదా ఎద సడి లోనే.. లయ లేదా

ఏ కళ కైనా.. ఏ కల కైనా జీవిత రంగం.. వేదిక కాదా ప్రజా ధనం కాని.. కళా విలాసం ఏ ప్రయోజనం లేని.. వృధా వికాసం కూసే కోయిల పోతే.. కాలం ఆగిందా పారే ఏరే పాడే.. మరో పదం రాదా మురళికి గల స్వరముల కళ.. పెదవిని విడి పలుకదు కద

తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం

చిత్రం: రుద్రవీణ సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: ఎస్ పీ బాలసుబ్రమణ్యం

వీక్షించండి: