Lyrics: సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మా - Suvvi suvvi suvvalamma lyrics in telugu


Suvvi suvvi suvvalamma lyrics in telugu

నిసరిమ పనిసరి నిరిదిస నిపమపని సా నిపరిమరీ నీసా తానననా.. తానానా తదరీ రీ.. నా.. ఆ..

పల్లవి: సువ్వి సువ్వి.. సువ్వాలమ్మ.. సీతాలమ్మా ఉహు గువ్వ మువ్వ.. సవ్వాడల్లే నవ్వాలమ్మా సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మా గువ్వ మువ్వ సవ్వాడల్లే.. నవ్వాలమ్మా హ హ ఆ ఆ అ అ ఆ సువ్వి సువ్వి.. సువ్వాలమ్మా.. సీతాలమ్మా సువ్వి సువ్వి సువ్వీ... సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మా.. సీతాలమ్మా

ఓహోహో ఓహోహూ ఓ ఓహోహో ఓ హో హో ఆహాహా ఆహాహా ఏ హేహేహేహే

చరణం 1: అండా దండా ఉండాలని.. కోదండా రాముని నమ్ముకుంటే అండా దండా ఉండాలని.. కోదండా రాముని నమ్ముకుంటే గుండేలేని మనిషల్లే.. నిను కొండా కోనల కొదిలేసాడా గుండేలేని మనిషల్లే.. గుండేలేని మనిషల్లే.. నిను కొండా కోనల కొదిలేసాడా అగ్గిలోనా దూకి.. పువ్వు మొగ్గాలాగా తేలిన నువ్వు నెగ్గేవమ్మ ఒక నాడు.. నింగీ నేల నీ తోడు నెగ్గేవమ్మ ఒక నాడు.. నింగీ నేల నీ తోడు

సువ్వి సువ్వి సువ్వీ.. సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి.. సువ్వాలమ్మా.. సీతాలమ్మా..

చరణం 2: చుట్టూ వున్నా చెట్టు చేమా.. తోబొట్టువులింకా నీకమ్మా చుట్టూ వున్న చెట్టు చేమా.. తోబొట్టువులింకా నీకమ్మా ఆగక పొంగే కన్నీళ్లే.. నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా ఆగక పొంగే కనీళ్ళే.. నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా పట్టిన గ్రహణం విడిచీ.. నీ బ్రతుకున పున్నమి పండే ఘడియ వస్తుందమ్మా ఒకనాడు.. చూస్తున్నాడు పైవాడు వస్తుందా ఆ నాడు.. చూస్తాడ ఆ పైవాడు..

సువ్వి సువ్వి సువ్వీ...

Song: సువ్వి సువ్వి సువ్వాలమ్మ (Suvvi Suvvi Suvvalamma) Movie: స్వాతి ముత్యం (Swati Mutyam) Music: ఇళయరాజా (Ilayaraja) Lyricist: వేటూరి సుందర రామమూర్తి (Veturi SundaraRama Murthy) Singers: ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం, జానకి (S.P. Balasubrahmanyam, Janaki)