Lyrics: సోలపురం పోయినాను సోలడడ్లు తెచ్చినాను - Solapuram poyinanu song lyrics in telugu
Solapuram poyinanu song lyrics in telugu
సోలపురం పోయినాను.. సోలడడ్లు తెచ్చినాను సోలపురం పోయినాను.. సోలడడ్లు తెచ్చినాను దంచనన్న దంచే.. ఆహా నేను దంచ పో మా యమ్మగాని దంచే.. ఉహూ నేను దంచ పో
సోలాపురం బోయి బలే.. సోకులవడి వచ్చినావు సోలాపురం బోయి బలే.. సోకులవడి వచ్చినావు నేను దంచపోవోయ్.. ఎందుకెనా సిత్రాంగి ఒడ్లు దంచపోవోయ్.. ఎందుకెనా అర్దాంగి
ఆ దంచకుంటే దంచకుంటివి.. నేనే దంచుకుంట గాని దంచకుంటే దంచకుంటివి.. నేనే దంచుకుంట గాని సెరుగనన్న సెరుగే.. ఆహా నేను సెరుగ పో మా తల్లిగాని సెరుగే.. ఉహూ నేను సెరుగ పో నువ్వు దంచినొడ్లలోన.. ఎన్ని మెరిగలున్నయో నువ్వు దంచినొడ్లలోన.. ఎన్ని మెరిగలున్నయో నేను సెరుగపోవోయ్.. అట్లంటే ఎట్లనే బియ్యం సెరుగపోవోయ్.. మరి ఏమొండి తిందమే
సెరగకుంటే సెరగకుంటివి.. నేనే సెరుక్కుంట గాని సెరగకుంటే సెరగకుంటివి.. నేనే సెరుక్కుంట గాని ఒండనన్న ఒండే.. ఆహా నేను వండ పో మా యమ్మగాని ఒండే.. ఉహూ నేను వండ పో
పొయ్యి మీద వండితే నా.. కళ్ళకు పొగ వచ్చునయ్య పొయ్యి మీద వండితే నా.. కళ్ళకు పొగ వచ్చునయ్య నేను వండపోవోయ్, అయ్యో నా పెళ్ళమా నువ్వే వండుకోవోయ్, అన్నం గూడోండవా
ఒండకుంటె ఒండకుంటివి.. నేనే ఒండుకుంట గాని ఒండకుంటె ఒండకుంటివి.. నేనే ఒండుకుంట గాని తిననన్నా తినవే.. ఆహా నేను తినను పో మా తల్లిగాని తినవే.. ఉహూ నేను తినను పో పనులన్నీ చేసినా.. చేతులకూ నొప్పులాయే పనులన్నీ చేసినా.. చేతులకూ నొప్పులాయే నువ్వే తినబెట్టూ.. ఇక పట్టరాదె బంగారం ముద్దుగ తినబెట్టూ.. సరేలే నా సింగారం
నీకేది కావాలన్న చెప్పు.. తోడుగ నేనున్నా నీకేది కావాలన్న చెప్పు.. తోడుగ నేనున్నాను సరే నానే భామా, నువ్వు బంగారమే ఓ బావ నీ మీదనే నా ప్రేమా, నువ్వే నాకు ధీమా ఏ జన్మల పుణ్యమొ.. నాకు భర్తగా నువ్వు దొరికినావు ఏ జన్మల పుణ్యమొ.. నాకు భర్తగా నువ్వు దొరికినావు రాముడంటి ప్రేమ.. సీత కష్టాలను పెట్టబోనె జీవితమే నీతో.. కలకాలము కలిసుందామే
Song: సోలపురం పోయినాను (Solapuram Poyinanu) Music: మార్క్ ప్రశాంత్ (Mark Prashanth) Lyricist: వసీం (Waseem) Singers: దిలీప్ దేవగన్, మణిశ్రీ (Dilip Devgan, Manisri)
వీక్షించండి: