Lyrics: ప్రేమా ప్రేమా.. నను నేనె మరచినా నీ తోడు - Prema prema song lyrics in Telugu - Premadesham

Nanu nene marachina nee thodu lyrics - Premadesham

ప్రేమా ప్రేమా.. ప్రేమా ప్రేమా నను నేనె మరచినా నీ తోడు.. విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు.. ప్రేమా.. ఆ ఆ నా నీడ నన్ను విడిపోయిందే.. నీ శ్వాసలోన అది చేరిందె నేనున్న సంగతే మరిచిందే.. ప్రేమా ప్రేమా..

చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ.. రావా..! నా వాకిట్లో.. నీకై నే వేచానే.. నను నేనె మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు.. వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..

ఆకాశ దీపాన్నై.. నే వేచి ఉన్నా.. నీ పిలుపు కోసం చిన్నారి నీ రూపె కళ్ళల్లో.. నే నిలుపుకున్న కరుణించలేవా సుకుమారి నా గుండె లోతుల్లో.. దాగుంది నీవే నువు లేక లోకంలో.. జీవించలేనే నీ ఊహ తోనే బ్రతికున్నా..

నను నేనె మరచినా నీ తోడు.. విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు.. ప్రేమా.. ఆ ఆ నా నీడ నన్ను విడిపోయిందే.. నీ శ్వాసలోన అది నిలిచిందే నేనున్న సంగతే మరిచిందే.. ప్రేమా ప్రేమా..

నిమిషాలు శూలాలై.. వెంటాడుతున్నా.. ఒడి చేర్చుకోవా వయ్యారి విరహాల ఉప్పెనలో.. నే చిక్కుకున్నా.. ఓదార్చి పోవా ఓసారి ప్రేమించలేకున్నా.. ప్రియమార ప్రేమా.. ప్రేమించినానంటూ.. బ్రతికించలేవా.. అది నాకు చాలే చెలీ..

నను నేనె మరచినా నీ తోడు.. విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు.. ప్రేమా.. ఆ ఆ నా నీడ నన్ను విడిపోయిందే.. నీ శ్వాసలోన అది నిలిచిందే నేనున్న సంగతే మరిచిందే.. ప్రేమా ప్రేమా..

చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ.. రావా..! నా వాకిట్లో.. నీకై నే వేచానే.. నను నేనె మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు.. వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..

నను నేనె మరచినా నీ తోడు.. విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు.. ప్రేమా.. ఆ ఆ

Song: ప్రేమా ప్రేమా (Prema Prema) Movie: ప్రేమదేశం (Premadesham) Music: ఏ.ఆర్. రెహమాన్ (A.R. Rehman) Lyricist: భువన చంద్ర (Bhuvana Chandra) Singer: ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం (S.P. Balasubrahmanyam)

వీక్షించండి: