Lyrics: పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా - Pedave palikina matallone song lyrics in telugu - Nani

Pedave palikina song lyrics in telugu
Pedave palikina song lyrics in telugu

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా.. కంటికి వెలుగమ్మా

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా.. కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపీ పెడుతుంది ముద్దగా తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ

మనలోనీ ప్రాణం అమ్మా మనదైనా రూపం అమ్మా యెనలేనీ జాలి గుణమే అమ్మా నడిపించే దీపం అమ్మ కరుణించే కోపం అమ్మ వరమిచ్చే తీపి శాపం అమ్మా

నా ఆళి అమ్మగా అవుతుండగా జో లాలి పాడనా కమ్మగా కమ్మగా

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా.. కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపీ పెడుతుంది ముద్దగా తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ

ఆ.. ఆ.. ఆ.. ఆ.. పొత్తిల్లో ఎదిగే బాబు నా ఒళ్ళో ఒదిగే బాబు ఇరువురికీ నేను అమ్మవనా నా కొంగు పట్టేవాడు నా కడుపున పుట్టేవాడు ఇద్దరికీ ప్రేమ అందించనా

నా చిన్ని నాన్ననీ వాడి నాన్ననీ నూరేళ్లు సాకనా చల్లగా చల్లగా

ఎదిగీ ఎదగని ఓ పసికూనా ముద్దుల కన్నా జో జో బంగరు తండ్రీ జో జో బజ్జో లాలీ జో

పలికే పదమే వినకా కనులారా నిదురపో కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి

ఎదిగీ ఎదగని ఓ పసికూనా ముద్దుల కన్నా జో జో బంగరు తండ్రీ జో జో బజ్జో లాలీ జో బజ్జో లాలీ జో బజ్జో లాలీ జో బజ్జో లాలి జో

చిత్రం: నాని సంగీతం: ఏ ఆర్ రెహ్మాన్ రచన: చంద్రబోస్ గానం: ఉన్నీ కృష్ణన్, సాధన సర్గం

వీక్షించండి: