Lyrics: ఓం మహా ప్రాణ దీపం శివం శివం - Om mahaprana deepam song lyrics in telugu


Om mahaprana deepam lyrics in telugu

ఓం మహా ప్రాణ దీపం.. శివం శివం మహోంకార రూపం.. శివం శివం మహా సూర్య చంద్రా త్రినేత్రం పవిత్రం మహా గాఢ తిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతి బీజం, మహా దివ్య తేజం భవానీ సమేతం, భజే మంజునాథం

ఓ.. ఓ.. ఓం.. నమః శంకరాయచ మయస్కరాయచ, నమశ్శివాయచ శివతరాయచ, భవహరాయచ

మహా ప్రాణ దీపం.. శివం శివం భజే మంజునాథం.. శివం శివం

అద్వైత భాస్కరం.. అర్ద నారీశ్వరం.. మృదుస హృదయంగమం.. చతురుధతి సంగమం.. పంచ భూతాత్మకం, షట్చత్రునాశకం సప్త స్వరేశ్వరం.. అష్ట సిద్దీశ్వరం.. నవరస మనోహరం.. దశ దిశా సువిమలం..

ఏకాదశోజ్జ్వలం.. ఏక నాథేశ్వరం.. ప్రస్తుతివ శంకరం.. ప్రమధఘణ కింకరం దుర్జన భయంకరం.. సజ్జన శుభంకరం.. ప్రాణి భవతారకం, ప్రకృతి హిత కారకం భువన భవ్య భవనాయకం, భాగ్యాత్మకం రక్షకం

ఈశం, సురేశం, వృషేశం, పరేశం నటేశం, గౌరీశం, గణేశం, భూతేశం.. మహా మధుర పంచాక్షరీ మంత్ర మాధ్యం మహా హర్ష వర్ష ప్రవర్షం సుధీశం

ఓం.. నమో హరాయచ స్వర హరాయచ, పురహరాయచ రుద్రాయచ, భద్రాయచ, ఇంద్రాయచ నిత్యాయచ, నిర్ణిద్రాయచ మహా ప్రాణ దీపం శివం శివం భజే మంజునాథం శివం..శివం..

ఢంఢంఢ ఢంఢంఢ ఢంఢంఢ ఢంఢంఢ ఢంకా నినాద నవ తాండవా డంబరం తద్దిమ్మి తకదిమ్మి ధిద్దిమ్మి ధిమిధిమ్మి సంగీత సాహిత్య సుమ కమల బంభరం

ఓంకార గ్రీంకార శ్రీంకార హైంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాధ్యం, యజుర్వేద వేద్యం సామ ప్రగీతం, అధర్వ ప్రభాతం పురాణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విరుద్ధం సుసిద్ధం

నకారం, మకారం, శికారం, వకారం యకారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహా నీల కంఠం మహనంద నందం మహట్టాట్ట హాసం జటాజూట రంగైక గంగా సుచిత్రం జ్వలత్ ఉగ్ర నేత్రం, సుమిత్రం సుగోత్రం

మహాకాశ భాసం, మహా భానులింగం.. ఊ.. మహా భత్రు వర్ణం, సువర్ణం ప్రవర్ణం.. ఊ..

సౌరాష్ట్ర సుందరం.. సోమనాథేశ్వరం శ్రీశైల మందిరం.. శ్రీ మల్లికార్జునం ఉజ్జయిని పుర మహాకాళేశ్వరం వైద్య నాధేశ్వరం, మహా భీమేశ్వరం అమర లింగేశ్వరం, రామ లింగేశ్వరం కాశి విశ్వేశ్వరం, పరం ఘృష్ణేశ్వరం త్రయంబకాధీశ్వరం, నాగ లింగేశ్వరం శ్రీ.. కేదార లింగేశ్వరం..

అగ్ని లింగాత్మకం, జ్యోతి లింగాత్మకం వాయు లింగాత్మకం, ఆత్మ లింగాత్మకం అఖిల లింగాత్మకం, అగ్ని సోమాత్మకం..మ్..

అనాదిం.. అమేయం.. అజేయం.. అచింత్యం.. అమోఘం.. అపూర్వం.. అనంతం.. అఖండం.. అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం

ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిం.. ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిం.. ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిం.. మ్..

ఓం.. నమః సోమాయచ, సౌమ్యాయచ భవ్యాయచ, భాగ్యాయచ, శాంతాయచ, శౌర్యాయచ యోగాయచ, భోగాయచ, కాలాయచ, కాంతాయచ రమ్యాయచ, గమ్యాయచ, ఈశాయచ, శ్రీచాయచ భవ్యాయచ, భాగ్యాయచ, భోగాయచ, యోగాయచ సోమాయచ, గమ్యాయచ, ఈశాయచ, శ్రీచాయచ శర్వాయచ, సర్వాయచ..