Lyrics: ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు - Oke oka jeevitham song lyrics in telugu - Mr Nookayya
Oke oka jeevitham song lyrics in telugu
ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు మళ్లీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు కష్టమనేది లేని రోజంటూ లేదు కదా కన్నీరు దాటు కుంటూ సాగిపోగ తప్పదుగా హో ఓ ఓ అమ్మ కడుపు వదిలిన అడుగడుగు హో ఓ ఓ ఆనందం కోసమే ఈ పరుగు హో ఓ ఓ కష్టాల బాటలో కడ వరకు హో ఓ ఓ చిరునవ్వు వదలకు ఓ ఓ ఓ ఓఓఓ
నువ్వెవరు నేనెవరు రాసినదెవరు మన కథలు నువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులు ఇది మంచి అని అది చెడ్డదని తూకాలు వేయగల వారెవరు అందరికి చివరాకరికి తుది తీర్పు ఒక్కడే పైవాడు అవుతున్న మేలు కీడు అనుభావలేగా రెండు దైవం చేతి బొమ్మలేగా నువ్వు నేను ఎవరైనా తలో పాత్ర వేయకుంటే కాల యాత్ర కదిలేనా హో ఓ ఓ నడి సంద్రమందు దిగి నిలిచాకా హో ఓ ఓ ఎదురీద కుండ మునకేస్తావా హో ఓ ఓ నిను నమ్ముకున్న నీ ప్రాణాన్ని హో ఓ ఓ అద్దరికి చేర్చవా ఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓ
పుట్టుకతో నీ అడుగు ఒంటరిగా మొదలైనదిలే బతుకు అనే మార్గములో తన తోడు ఎవరు నడవరులే చీకటిలో నిసి రాతిరిలో నీ నీడ కూడా నిను వదులునులే నీ వారు అను వారెవరు లేరంటూ నమ్మితే మంచిదిలే చితి వరకు నీతో నువ్వే చివరంట నీతో నువ్వే చుట్టూ ఉన్న లోకం అంత నీతో లేనే లేదనుకో నీకన్నుల్లో నీరు తుడిచే చేయి కూడా నీదనుకో హో ఓ ఓ లోకాన నమ్మకం లేదసలే హో ఓ ఓ దాని పేరు మోసమై మారేనులే హో ఓ ఓ వేరెవరి సాయమో ఎందుకులే హో ఓ ఓ నిన్ను నువ్వు నమ్ముకో.ఓ ఓ ఓ ఓ ఓ ఓ
Song: ఒకే ఒక జీవితం (Oke Oka Jeevitham) Movie: Mr.నూకయ్య (Mr. Nookaiah) Music: యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) Lyricist: రామజోగయ్య శాస్త్రి (Rama Jogaiah Shastry) Singer: హరిచరణ్ (Hari Charan)
వీక్షించండి: