నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప - అన్నమాచార్య కీర్తన - Nigama nigamantha varnitha - Full Lyrics - Annamacharya Keerthana
Annamayya: Nigama nigamantha varnitha Lyrics
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రీనారాయణా
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రీనారాయణా నారాయణ శ్రీమన్నారాయణా నారాయణ వెంకట నారాయణా
దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయ నోపక కదా నన్ను నొడబరుపుచు పైపై.. పైపైనె సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణా పైపైనె సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణా
నిగమ.. గమదని సగమగసాని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రీనారాయణా నారాయణ శ్రీమన్నారాయణా నారాయణ లక్ష్మి నారాయణా
చికాకు పడిన నా చిత్త శాంతముసేయ లేకకా నీవు బహులీలనన్ను కాకుసేసెదవు బహుకర్మల బడువారు నాకొలదివారలా నారాయణా
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రీనారాయణా
నీసా గసగసగసగసాగా దానిసగమగసాగామగా సనిదస్స నీసాదా సగమా గమగా మదని దనిస మగసనిదమగస
వివిధ నిర్బంధముల వెడల ద్రోయకనన్ను భవసాగరముల దడబడజేతురా దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశా హరే.. హరే..ఏ.. హరే.. దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ నవనీతచోరా శ్రీ నారాయణా
నిగమ సగమగసనిదమగాని నిగమ గసమాగధమనిదస్స
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ.. శ్రీనారాయణా నారాయణ.. శ్రీమన్నారాయణా.. వేద నారాయణా వెంకట నారాయణా.. తిరుమల నారాయణా కలియుగ నారాయణా.. హరి హరి నారాయణా అది నారాయణా.. లక్ష్మి నారాయణా శ్రీమన్నారాయణా శ్రీమన్నారాయణా శ్రీమన్నారాయణా
హరే.. హరే.. హరే.. హరే.. హరే..
సాహిత్యం: శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య కీర్తన