Lyrics: నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా - Nesthama iddari lokam song lyrics in telugu - Pelli Pandiri
Nesthama iddari lokam song lyrics in telugu - Pelli Pandiri
మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగీ నేల నేటి వరకు ఎన్నో అందాలు చిక్కాడు! ఊహు.. ఈ అందాలన్నీ చూడలేని.. నా కళ్ళు కూడా ఆయనే చెక్కాడుగా!
పల్లవి: నేస్తమా.. ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే.. నా కన్నులతో లోకం చూడమ్మా నేస్తమా.. ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే.. నా కన్నులతో లోకం చూడమ్మా
ఈ గుండెలోన.. నీ ఊపిరుంటే ఈ కళ్ళలోన.. నీ కళలు ఉంటే ఊహల రెక్కల పైనా.. ఊరేగే దారులు ఒకటే చూపులు ఎవ్వరివైనా.. చూపించే లోకం ఒకటే
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
చరణం 1: మరి లోకంలో ఎన్ని రంగులున్నాయి? అవి ఎలా ఉంటాయి? బుగ్గ మీద వెచ్చని సిగ్గు వచ్చినపుడు దానిని అడుగు ఎర్రదనం అంటే చెబుతుందీ పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమైన నీ చిరునవ్వు తెల్లరంగు అట్టా ఉంటుందీ
నీలో.. నిలువున పులకలు రేగిన వేళ నువ్వే.. పచ్చని పైరువు అవుతావమ్మ దిగులు రంగే.. హ.. హ.. నలుపు అనుకో హ.. హ.. ప్రేమ పొంగే.. హ.. హ.. పసుపు అనుకో హ.. భావాలను గమనిస్తుంటే.. ప్రతి రంగును చూస్తున్నట్టే చూపులు ఎవ్వరివైనా.. చూపించే లోకం ఒకటే
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
చరణం 2: ఉదయం సాయంత్రం అంటారే అవి ఎలా ఉంటాయి? మొదటిసారి నీ గుండెలలో తీయనైన ఆశలురేపి ఆ కదలికె ఉదయం అనుకోమ్మా చూడలేని ఆవేదనతో కలత చెంది అలిశావంటే సాయంత్రం అయినట్టేనమ్మా నీలో.. నవ్విన ఆశలు నా చెలిమైతే నేనై.. పలికిన పలుకులు నీ కులుకైతే ఇలవు నీవే.. హ.. హ.. రవిని నేనే హ.. హ.. కలువ నీవే.. హ.. హ.. శశిని నేనే హ.. ఒక్కరికోసం ఒకరం.. అనుకుంటూ జీవిస్తుంటే చూపులు ఎవ్వరివైనా.. చూపించే లోకం ఒకటే
నేస్తమా.. ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే.. నా కన్నులతో లోకం చూడమ్మా నేస్తమా.. ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే.. నా కన్నులతో లోకం చూడమ్మా
ఈ గుండెలోన.. నీ ఊపిరుంటే ఈ కళ్ళలోన.. నీ కళలు ఉంటే ఊహల రెక్కల పైనా.. ఊరేగే దారులు ఒకటే చూపులు ఎవరివైనా.. చూపించే లోకం ఒకటే
చిత్రం: పెళ్లి పందిరి రచన: గురు చరణ్ గానం: ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం, కే ఎస్ చిత్ర