Lyrics: నా పేరే ఎల్లమ్మా.. నేను జోగురాలమ్మో - Na pere yellamma song lyrics in telugu
Na pere yellamma song lyrics in telugu
నా పేరే ఎల్లమ్మా.. నేను జోగురాలమ్మో అయ్యో జోడు గంపల్లా.. నన్ను జోలాజోలంటీ ఆరూ గంపల్లా.. నేను ఆడినదాన్నమ్మో అందరి ముంగటా.. నేను అమ్మవారునే కలియుగములోనా.. కన్నే మాతానంటిరే యాపశెట్టంటీ.. నాకు ఇంపుగాయెనే నా పేరే ఎల్లమ్మా.. నేను జోగురాలమ్మో అయ్యో జోడు గంపల్లా.. నన్ను జోలాజోలంటీ
ఆ సెరుకట్టా మీదీ.. అమ్మి కట్టామైసినే నీ ఇంటి ముంగటా.. నే సుట్టామైతినే ఆ ముల్లోకాలేలే.. ఆ ముత్యాలమ్మనే నన్ను శరణన్నోళ్ళకీ.. నేను షరుతులిద్దునే అయ్యో కోరినోళ్లకూ.. నేను కొడుకులిద్దునే నన్ను అడిగినోళ్లకూ.. ఆడ బిడ్డలనిద్దునే నా పేరే ఎల్లమ్మా.. నేను జోగురాలమ్మో అయ్యో జోడు గంపల్లా.. నన్ను జోలాజోలంటీ
ఆ మర్రి సెట్లల్లా.. నే మావురాలినే ఆ ఒర్రెల ఒంపుల్లా.. నే ఒడ్డుకుంటినే సుట్టు సెట్టు సెలకల్లా.. నేను సక్కని తల్లినే ఆ గట్టు మీదున్నా.. గౌండ్లాడి బిడ్డనే ఆ మంద్దొడ్డ కు నేనూ.. మారెమ్మ తల్లినే ఆ గంగొడ్డుకు నేనూ.. గవురాలా తల్లినే నా పేరే ఎల్లమ్మా.. నేను జోగురాలమ్మో అయ్యో జోడు గంపల్లా.. నన్ను జోలాజోలంటీ
తీరొక్కా పేరూ.. నాది తీరు బండారూ తిరుగా రంగోలా.. నాకు తీరుతమిద్దురూ అయ్యో ఆషాఢం వేళా.. నాకు ఆరతులిద్దురూ అడ్డెడు బియ్యమ్ము.. నా ముంగట పోద్దురూ నా యాపారిళ్లలనీ.. నాకు తోరణమిద్దురూ ఆ యాటా పిల్లలనీ.. నాకు కానుకగిద్దురూ నా పేరే ఎల్లమ్మా.. నేను జోగురాలమ్మో అయ్యో జోడు గంపల్లా.. నన్ను జోలాజోలంటీ
నిమ్మకాయ దండలనీ.. నాకు నిండుగేద్దురే ఆ సీరే బట్టలనీ.. నాకు సారే పోద్దురే నా అక్కా సెల్లెల్లే.. నాకు పాటలు పాడుదురే నా ఆకిట్లా అలికీ.. బొట్లా పట్నాలేద్దురే అమ్మా శరణు శరణంటూ.. మాటా సాగాదీద్దురే తల్లీ శరణాళీయంటూ.. నన్నూ ఆరాదీద్దురే నా పేరే ఎల్లమ్మా.. నేను జోగురాలమ్మో అయ్యో జోడు గంపల్లా.. నన్ను జోలాజోలంటీ
Song: నా పేరే ఎల్లమ్మ (Na pere yellamma) Lyricist: రాజేందర్ కొండా (Rajender Konda) Singer: ప్రభ (Prabha) Music: మదీన్ SK (Madeen SK) Cast: నాగదుర్గ (Nagadurga)
వీక్షించండి: