Lyrics: మౌనమేలనోయి ఈ మరపురాని రేయి - Mounamelanoyi song lyrics in telugu


Mounamelanoyi song lyrics in telugu

మౌనమేలనోయి.. మౌనమేలనోయి ఈ మరపురాని రేయి మౌనమేలనోయి ఈ మరపురాని రేయి ఎదలో వెన్నెల.. వెలిగే కన్నుల ఎదలో వెన్నెల.. వెలిగే కన్నుల తారాడే.. హాయిలో..

ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి

పలికే.. పెదవి.. వణికింది ఎందుకో వొణికే.. పెదవి.. వెనకాల ఏమిటో కలిసే.. మనసులా.. విరిసే.. వయసులా కలిసే.. మనసులా.. విరిసే.. వయసులా నీలి నీలి ఊసులు.. లేతగాలి బాసలు ఏమేమో.. అడిగినా..

మౌనమేలనోయి ఈ మరపురాని రేయి

హిమమే.. కురిసే.. చందమామ కౌగిట సుమమే.. విరిసే.. వెన్నెలమ్మ వాకిట ఇవి ఏడడుగులా.. వలపు మడుగులా ఇవి ఏడడుగులా.. వలపు మడుగులా కన్నె ఈడు.. ఉలుకులు.. కంటిపాప.. కబురులు ఎంతెంతో.. తెలిసినా..

మౌనమేలనోయి ఈ మరపురాని రేయి ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి ఎదలో వెన్నెల.. వెలిగే కన్నుల ఎదలో వెన్నెల.. వెలిగే కన్నుల తారాడే.. హాయిలో..

ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి