Lyrics: మధువరమే - Madhuvarame song lyrics in telugu - Return of the Dragon
Madhuvaramae song lyrics in telugu
ఖాళీ కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే వరమే
నేడే తెలిసే నా నువ్వెవరో నాలో మెరిసే చిరునవ్వెవరో నేడే తెలిసే నా నువ్వెవరో నాలో మెరిసే చిరునవ్వెవరో
నిన్నే చూసి పులకింతా ఉయ్యాలూగె జగమంతా గొంతే దిగని దిగులంతా ఇట్టే చెరిగెనే..
రా చెయ్యి పట్టి నిను నడిపిస్తా భూ గ్రహపు అంచులలొ విహరిస్తా గగనాలనందుకొని ఆ చోటే తొలి ముద్దే నీకందిస్తా
నా సగము ఊపిరి పోగేస్తా అధరాల వాలుగా పంపిస్తా నీ గుండె నీడనై జీవిస్తా కడదాకా నీతో వస్తా
ఖాళీ కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే మండే ఇసుక తిన్నెలలో మంచయి చలువ కురిసావే మధువరమే మధువరమే వరమే
నేడే తెలిసే నా నువ్వెవరో నాలో మెరిసే చిరునవ్వెవరో
నల్లనైన నా కనుపాప సమ్మోహనమయ్యేలా తెల్లనైన ఆశలు చూపిందీ.. నీ ప్రేమేలే
వాన కురిసి వెలిసిన తీరు ఇన్నాళ్ల గతమంతా జిగేలంటు మెరిసే నీవల్లే..
చిరుగాలికి రివ్వున ఎగిరే పుప్పొడిలా నీపై వాలా ఈ హృదయము నీదేనంటూ వెతికి వెతికి జంటగ అవ్వగా
జత మనసు ఒక్కటుందని అంటూ ఏడ లాగిన నో అనుకుంటూ ఇన్నాళ్లకు నిను కనుకొన్న నమ్మకమే నిజముగా
ఖాళీ కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే
మండే ఇసుక తిన్నెలలో మంచయి చలువ కురిసావే మధువరమే మధువరమే వరమే
చిత్రం: రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (Return of The Dragon) సంగీతం: లియోన్ జేమ్స్ (Leon James) రచన : రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry) గానం: శరత్ సంతోష్ (Sarath Santhosh), శ్రీనిషా జయశీలన్ (Srinisha Jayaseelan)
వీక్షించండి: