
veyi kannulatho song lyrics
వేయి కన్నులతో ఉహ్హు ఉ హు హ్హు తెరచాటు దాటి చేరదా నీ స్నేహం వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదా నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదా నీ స్నేహం ప్రాణమే నీకు కానుకంటున్నా మన్నించి అందుకోవ నేస్తమా
వేయి కన్నులతో వేచి చూస్తున్న తెరచాటు దాటి చేరదా నీ స్నేహం
నీ చెలిమే ఊపిరిలా బ్రతికిస్తున్నది నన్ను నీ తలపే దీపంలా నడిపిస్తున్నది నన్ను ఎంత చెంత చేరిన సొంతమవని బంధమా ఎంతగా తపించినా అందనన్న పంతమా ఎంత ఆశ ఉన్న నిన్ను పిలిచేదెలాగమ్మా అందాల ఆకాశమా
వేయి కన్నులతో ఉహ్హు ఉ హు హ్హు తెరచాటు దాటి చేరదా నీ స్నేహం వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదా నీ స్నేహం కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదా నీ స్నేహం ప్రాణమే నీకు కానుకంటున్నా మన్నించి అందుకోవ నేస్తమా
ఎప్పటికీ నా మదిలో కొలువున్నది నువ్వైనా చెప్పుకునే వీలుందా ఆ సంగతి ఎపుడైనా రెప్పదాటి రాననే స్వప్నమేమి కాననీ ఒప్పుకుంటె నేరమా తప్పుకుంటె న్యాయమా ఒక్కసారి.. మ్మ్మ్.. ఒక్కసారి.. లా ల లా ల ఒక్కసారి ఐనా చేయి అందించి ఈ వింత దూరాన్ని కరిగించుమా
వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదా నీ స్నేహం ప్రతి నిముషం నీ ఎదుటే నిజమై తిరుగుతు లేనా నీ హృదయం ఆ నిజమే నమ్మను అంటూ ఉన్నా వీడిపోని నీడలా వెంట ఉంది నేననీ చూడలేని నిన్నెలా కలుసుకోను చెప్పుమా ఎన్ని జన్మలైనా పోల్చుకోవేమో వెతికేది నీలోని నన్నేననీ
చిత్రం : నీ స్నేహం (2003) సంగీతం : ఆర్.పి.పట్నాయక్ రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం : ఆర్.పి.పట్నాయక్ , ఉష