Vennela vennela mellaga rave song lyrics in telugu - Premadesham - వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూవుల తేనెలే తేవే (లిరిక్స్)


Vennela vennela song lyrics in telugu

వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూవుల తేనెలే తేవే వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూవుల తేనెలే తేవే

కడలి ఒడిలో.. నదులు ఒదిగి నిదుర పోయే వేళా కనుల పైన.. కలలే వాలి సోలి పోయే వేళా వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూవుల తేనెలే తేవే

ఆశ ఎన్నడు విడువదా అడగ రాదని తెలియదా నా ప్రాణం చెలియా నీవే లే విరగబూసిన వెన్నెలా వదిలి వేయ్యకే నన్నిలా రా రాదా ఎద నీదే కాదా నిదుర నిచ్చే జాబిలీ నిదురలేక నీవే వాడినావా

వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూవుల తేనెలే తేవే

మంచు తెరలో అలిసిపోయి మధన సంధ్య తూగెనే పుడమి వొడిలో కళలు కంటూ పాపా నీవూ నిదురపో మల్లె అందం మగువ కెరుకా మనసు బాధ తెలియదా గుండె నిండా ఊసులే నీ ఎదుటనుంటే మౌనమే జోల పాటా పాడినానే నిదురలేక పాడిన

వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూవుల తేనెలే తేవే వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూవుల తేనెలే తేవే

చిత్రం: ప్రేమదేశం రచన: భువన చంద్ర సంగీతం: ఆ ఆర్ రెహమాన్ గానం: మనో, ఉన్నికృష్ణన్

సంబంధిత కథనాలు (Related Articles)

ఎక్కువ మంది చదివినవి (Most Read)


Please Support