
Priya priyathama ragalu song lyrics in telugu
పల్లవి: ప్రియా ప్రియతమా రాగాలూ సఖీ కుశలమా అందాలు ప్రియా ప్రియతమా రాగాలూ సఖీ కుశలమా అందాలు నీ.. లయ పంచుకుంటుంటే.. నా.. శ్రుతి మించిపోతుంటే.. నా..లో.. రే.. గే..
ప్రియా ప్రియతమా రాగాలూ సఖీ కుశలమా అందాలు ప్రియా ప్రియతమా రాగాలూ సఖీ కుశలమా అందాలూ
చరణం: జగాలు లేనీ సీమలో.. యుగాలు దాటె ప్రేమలూ పెదాల మూగ పాటలో.. పదాలు పాడే ఆశలూ ఎవరులేని మనసులో ఎదురు రావే నా చెలీ అడుగుజారే వయసులో అడిగి చూడూ కౌగిలీ ఒకే వసంతం.. కూహు నినాదం.. నీలో.. నాలో.. పలికే
ప్రియా ప్రియతమా రాగాలూ సఖీ కుశలమా అందాలూ నీ.. లయ పంచుకుంటుంటే.. నా.. శ్రుతి మించిపోతుంటే.. నా..లో.. రే.. గే.. ప్రియా ప్రియతమా రాగాలూ సఖీ కుశలమా అందాలూ
చరణం: శరత్తు లోనా వెన్నెలా తలెత్తుకుంది కన్నులా షికారు చేసే కోకిలా పుకారు వేసే కాకిలా ఎవరు ఎంతా వలచినా చిగురు వేసే కోరికా నింగి తానే విడిచినా ఇలకు రాదూ తారకా మదే ప్రపంచం.. విధే విలాసం నిన్ను.. నన్ను.. కలిపే
ప్రియా ప్రియతమా రాగాలూ సఖీ కుశలమా అందాలూ ప్రియా ప్రియతమా రాగాలూ సఖీ కుశలమా అందాలూ నీ.. లయ పంచుకుంటుంటే.. నా.. శ్రుతి మించిపోతుంటే.. నా..లో.. రే.. గే..
ప్రియా ప్రియతమా రాగాలూ సఖీ కుశలమా అందాలూ ప్రియా ప్రియతమా రాగాలూ సఖీ కుశలమా అందాలూ
చిత్రం: కిల్లర్ రచన: వేటూరి సుందర రామ మూర్తి సంగీతం: ఇళయరాజా గానం: మనో, కే.ఎస్. చిత్ర