లిరిక్స్ (Lyrics): నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా.. నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా


Ne Prashnalu Neeve Song Lyrics In Telugu

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా

పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా.. అపుడో ఇపుడో కననే కనను అంటుందా! ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా.. గుడికో జడకో సాగనంపక ఉంటుందా! బతుకంటే బడి చదువా? అనుకుంటే అతిసులువా? పొరపడినా పడినా.. జాలిపడదే కాలం మనలాగా.. ఒక నిమిషం కూడా.. ఆగిపోదే నువ్వొచ్చేదాకా!

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా! కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా! గతముందని గమనించని నడిరేయికి రేపుందా! గతితోచని గమనానికి గమ్యం అంటూ ఉందా! వలపేదో వల వేస్తుంది.. వయసేమో అటు తోస్తుంది.. గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది!

ఓ ఓ ఓ సుడిలో పడు ప్రతి నావ.. ఓ ఓ ఓ చెబుతున్నది వినలేవా!

పొరబాటున చెయిజారిన తరుణం తిరిగొస్తుందా! ప్రతిపూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా! మనకోసమె తనలో తను రగిలే రవి తపనంత.. కనుమూసిన తరువాతనె పెనుచీకటి చెబుతుందా! కడతేరని పయనాలెన్ని.. పడదోసిన ప్రణయాలెన్ని.. అని తిరగేశాయా చరిత పుటలు.. వెనుచూడక ఉరికే జతలు! తమ ముందుతరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు

ఓ ఓ ఓ ఓ ఓ ఇది కాదే విధిరాత.. ఓ ఓ ఓ ఓ ఓ అనుకోదేం ఎదురీత!

పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా.. అపుడో ఇపుడో కననే కనను అంటుందా!

ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా.. గుడికో జడకో సాగనంపక ఉంటుందా!

బతుకంటే బడి చదువా! అనుకుంటే అతిసులువా! పొరపడినా పడినా.. జాలిపడదే కాలం మనలాగా.. ఒక నిమిషం కూడా.. ఆగిపోదే నువ్వొచ్చేదాకా!

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

సంబంధిత కథనాలు (Related Articles)

ఎక్కువ మంది చదివినవి (Most Read)


Please Support