నమ్మవేమో గాని అందాల యువరాణి.. నేలపై వాలింది నా ముందే విరిసిందీ - nammavemo gani song lyrics telugu


Nammavemo gani andala yuvarani lyrics in telugu

నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే విరిసిందీ

నమ్మవేమో కాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే విరిసిందీ

అందుకే అమాంతం నా మదీ అక్కడే నిశ్శబ్దం అయినదీ ఎందుకో ప్రపంచం అన్నదీ ఇక్కడే ఇలాగే నాతో ఉందీ

నిజంగా కల్లతో వింతగా మంత్రమేసిందీ అదేదో మాయలో నన్నిలా ముంచి వేసిందీ నిజంగా కల్లతో వింతగా మంత్రమేసిందీ అదేదో మాయలో నన్నిలా ముంచి వేసిందీ

నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే రూపం ఈడు బారాలై ముందర నిలుచుంటే ఆ సొయగాన్నే నే చూడగానే ఓ రాయిలాగ అయ్యాను నేనే అడిగ పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా

నిజంగా కల్లతో వింతగా మంత్రమేసిందీ అదేదో మాయలో నన్నిలా ముంచి వేసిందీ నిజంగా కల్లతో వింతగా మంత్రమేసిందీ అదేదో మాయలో నన్నిలా ముంచి వేసిందీ

వేకువలోనా ఆకాశం ఆమెను చేరింది ఓ క్షణమైనా అధరాల రంగును ఇమ్మందీ వేసవి పాపం చలి వేసి ఆమెను వేడింది శ్వాసలలోన తల దాచి జాలిగ కూర్చుంది ఆ అందమంతా నా సొంతమైతే ఆనందమైనా వందేళ్ళు నావే కలల తాకిడిని మనసు తాలదిక వెతికి చూడు చెలిని

నిజంగా కల్లతో వింతగా మంత్రమేసిందీ అదేదో మాయలో నన్నిలా ముంచి వేసిందీ

చిత్రం: పరుగు సంగీతం : మణిశర్మ రచన - అనంత్ శ్రీరామ్ గానం: సాకేత్

సంబంధిత కథనాలు (Related Articles)

ఎక్కువ మంది చదివినవి (Most Read)


Please Support