
Rudraveena - Nammaku nammaku ee reyini lyrics in Telugu
సీకటమ్మ సీకటీ ముచ్చటైన సీకటీ యెచ్చనైన ఊసులెన్నొ రెచ్చగొట్టు సీకటీ నిన్ను నన్ను రమ్మందీ కన్నుగొట్టి సీకటీ ముద్దుగా ఇద్దరికే ఒద్దికైన సీకటీ
పొద్దుపొడుపే లేని సీకటే ఉండిపోనీ మన మధ్య రానీక లోకాన్ని నిద్దరోనీ రాయే రాయే.. రామసిలకా.. సద్దుకుపోయే.. సీకటేనకా..
పల్లవి : నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని నమ్మకు నమ్మకు ఈ రేయిని అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి.. మత్తులోన మెత్తగ తోసి నీ కన్నులు మూసి.. మత్తులోన మెత్తగ తోసి కలలే.. వలగా.. విసిరే.. చీకట్లను నమ్మకు నమ్మకు ఈ రేయిని అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
వెన్నెలలోనీ.. మసకలలోనే.. మసులును లోకం.. అనుకోకూ రవికిరణం కనపడితే తెలియును తేడాలన్నీ
నమ్మకు నమ్మకు అరే.. నమ్మకు నమ్మకు నువ్వూ... నమ్మకు నమ్మకు ఈ రేయిని అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
చరణం 1 : ఆకాశం తాకే ఏ మేడకైనా.. ఆధారం లేదా ఈ నేలలో ఆకాశం తాకే ఏ మేడకైనా.. ఆధారం లేదా ఈ నేలలో పుడమిని చూడని కన్ను.. నడపదు ముందుకు నిన్ను నిరసన చూపకు నువ్వు ఏనాటికీ పక్కవారి గుండెలనిండా.. చిక్కనైన వేదన నిండా పక్కవారి గుండెలనిండా.. చిక్కనైన వేదన నిండ ఏ హాయి.. రాదోయి.. నీ వైపు.. మరువకు అది
నమ్మకు నమ్మకు అరే.. నమ్మకు నమ్మకు అహా... నమ్మకు నమ్మకు ఈ రేయిని అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
చరణం 2 : శీతాకాలంలో ఏ కోయిలైనా.. రాగం తీసేనా ఏకాకిలా శీతాకాలంలో ఏ కోయిలైనా.. రాగం తీసేనా ఏకాకిలా మురిసే పువ్వులు లేక.. విరిసే నవ్వులు లేక ఎవ్వరికీ చెందని గానం సాగించునా పదుగురి సౌఖ్యం పండే.. దినమే పండుగ కాదా పదుగురి సౌఖ్యం పండే.. దినమే పండుగ కాదా ఆనాడు.. వాసంత.. గీతాలు.. పలుకును కద
మ గసమ గసమ దమద నిదని మమమ మగస మమమమదమ దదదనిదద నినినిని సగసని సని దనిదమదమ నిసనిదసని దనిదమపగ
నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు అహా నమ్మకు నమ్మకు ఈ రేయిని అహ కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి.. మత్తులోన మెత్తగ తోసి నీ కన్నులు మూసి.. మత్తులోన మెత్తగ తోసి కలలే.. వలగా.. విసిరే.. చీకట్లను
నమ్మకు నమ్మకు ఈ రేయిని అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని

Sirivennela - Nammaku nammaku ee reyini lyrics
రచన: సిరివెన్నెల సీత రామ శాస్త్రి గానం: ఎస్పీ బాలు చిత్రం: రుద్రవీణ సంగీతం: ఇళయరాజా