
Pacha pachani chelallo - Na kodaka song lyrics - Kubera
పచ్ఛా పచ్చని చేలల్లో పూసేటి పువ్వుల తావుల్లో నవ్వులు ఏరుతు నడిచేద్దాము చేతులు పట్టుకో నా కొడుకా..
కడుపున నిన్ను దాచుకుని నీడల్లే నిన్ను అంటుకుని కలిసే ఉంటా ఎప్పటికీ నీ చేతిని వదలను నా కొడుకా..
పదిలంగా నువ్వు నడవలే పది కాలాలు నువ్వు బతకాలే చందమామకు చెబుతున్నా నిను చల్లగా చూస్తాది నా కొడుకా..
ఓ ఓ ఓఓఓ
ఆకలితో నువ్వు పస్తుంటే నీ డొక్కలు ఎండిపోయేరా చెట్టు చెట్టుకి చెబుతున్నా నీ కడుపు నింపమని నా కొడుకా..
నిద్దురలేక నువ్వుంటే నీ కన్నులు ఎర్రగా మారేరా నీలి మబ్బుతో చెబుతున్నా నీ జోల పాడమని నా కొడుకా..
మనుషికీ మనిషే దూరమురా ఇది మాయా లోకపు ధర్మమురా బడిలో చెప్పని పాఠం ఇదిరా బతికే నేర్చుకో నా కొడుకా..
తిడితే వాళ్లకే తాగిలేను నిను కొట్టిన చేతులు విరిగేను ఒద్దిక నేర్చి ఓర్చుకునుండు ఓపికతోటి నా కొడుకా.. రాళ్ళు రప్పల దారులు నీవి అడుగులు పదిలం ఓ కొడుకా మెత్తటి కాళ్ళు ఒత్తుకు పోతాయి చూసుకు నడువురా నా కొడుకా..
చుక్కలు దిక్కులు నేస్తులు నీకు చక్కగా బతుకు ఓ కొడుకా ఒక్కనివనుకొని దిగులైపోకు పక్కనే ఉంటా నా కొడుకా..
పాణము నీది పిట్టల తోటిది ఉచ్చుల పడకు ఓ కొడుకా ముళ్ళ కంపలో గూడు కట్టేటి నేర్పుతో ఎదగారా నా కొడుకా..
ఏ దారిలో నువ్వు పోతున్నా ఏ గండం నీకు ఏదురైనా ఏ కీడు ఎన్నడు జరగదు నీకు అమ్మ దివేనిది నా కొడుకా..
ఈ దిక్కులు నీతో కదిలేను ఆ చుక్కలే దిష్టి తీసేను ఏ గాలి ధూళి సోకదు నిన్ను అమ్మ దివేనిది నా కొడుకా..
ఏ పిడుగుల చప్పుడు వినపడినా ఏ బూచోడికి నువ్వు భయపడినా ఈ చీకటి నిన్నేం చెయ్యదులేరా అమ్మ దివేనిది నా కొడుకా.. అమ్మ దివేనిది నా కొడుకా..
చిత్రం: కుబేర (Kubera) గానం: సిందూరి విశాల్ (Sinduri Vishal) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సాహిత్యం: నంద కిషోర్ (Nanda Kishore)