
Kothaga Rekkalochena Song Lyrics in Telugu
పల్లవి : కొత్తగా.. రెక్కలొచ్చెనా.. గూటి లోనీ.. గువ్వ పిల్లకీ.. మెత్తగా.. రేకు విచ్చెనా.. మెత్తగా.. రేకు విచ్చెనా.. కొమ్మ చాటునున్న కన్నె మల్లికి.. కొమ్మ చాటునున్న కన్నె మల్లికి.. కొత్తగా.. రెక్కలొచ్చెనా.. మెత్తగా.. రేకు విచ్చెనా..
చరణం 1: కొండ దారి మార్చిందీ.. కొంటె వాగు జోరూ.. కులుకులెన్నో నేర్చిందీ.. కలికి ఏటి నీరు..
కొండ దారి మార్చిందీ.. కొంటె వాగు జోరూ.. కులుకులెన్నో నేర్చిందీ.. కలికి ఏటి నీరు
బండరాల హోరు మారీ.. పంట చేల పాటలూరి బండరాల హోరు మారీ.. పంట చేల పాటలూరి
మేఘాల రాగాల.. మాగాణి ఊగేల.. సిరి చిందులేసింది.. కను విందు చేసింది కొత్తగా.. రెక్కలొచ్చెనా.. మెత్తగా.. రేకు విచ్చెనా..
చరణం 2: వెదురులోకి ఒదిగిందీ.. కుదురులేని గాలి ఎదురులేక ఎదిగిందీ.. మధురగానకేళి
వెదురులోకి ఒదిగిందీ.. కుదురులేని గాలి ఎదురులేక ఎదిగిందీ.. మధురగానకేళి
బాష లోన రాయలేనీ.. రాసలీల రేయి లోని బాష లోన రాయలేనీ.. రాసలీల రేయి లోని
యమున తరంగాల.. కమనీయ శృంగార.. కలలెన్నో చూపింది.. కళలెన్నో రేపింది.. కొత్తగా.. రెక్కలొచ్చెనా.. గూటి లోని గువ్వ పిల్లకీ.. మెత్తగా.. రేకు విచ్చెనా.. మెత్తగా.. రేకు విచ్చెనా..
కొమ్మ చాటునున్న కన్నె మల్లికి.. కొమ్మ చాటునున్న కన్నె మల్లికి.. కొత్తగా.. రెక్కలొచ్చెనా.. మెత్తగా.. రేకు విచ్చెనా..!
చిత్రం: స్వర్ణ కమలం రచన: సిరి వెన్నెల సంగీతం: ఇళయరాజా గానం: ఎస్పీ బాలు, ఎస్ జానకి