లిరిక్స్ (Lyrics): కలగంటి కలగంటి.. ఇప్పుడిటు కలగంటి - అన్నమయ్య కీర్తన


kalaganti kalaganti lyrics in telugu

పల్లవి: కలగంటి కలగంటి.. ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు.. తిరు వేంకటాద్రీశుడంటి కలగంటి కలగంటి..ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు.. తిరు వేంకటాద్రీశుడంటి ఇప్పుడిటు కలగంటి

చరణం 1: అతిశయంబైన శేషాద్రి శిఖరముగంటి ప్రతిలేని గోపుర ప్రభలుగంటి శతకోటి సూర్యతేజములు వెలుగగగంటి చతురాశ్యు పొడగంటీ చతురాశ్యు పొడగంటి.. చయ్యన మేలుకొంటి

ఇప్పుడిటు కలగంటి

చరణం 2: కనకరత్న కవాట కాంతు లిరుగడగంటి ఘనమైన దీపసంఘములు గంటి అనుపమ మణిమయమగు కిరీటము గంటి కనకాంబరము గంటి గ్రక్కన మేలుకంటి

ఇప్పుడిటు కలగంటి

చరణం 3: అరుదైన శంఖచక్రాదులిరుగడగంటి సరిలేని అభయ హస్తమునుకంటి తిరు వేంకటాచాలదిపుని చూడగగంటి హరిగంటి గురుగంటి నంతట మేలుకంటి

ఇప్పుడిటు కలగంటి

కీర్తన: తాళ్ళపాక అన్నమాచార్య

సంబంధిత కథనాలు (Related Articles)

ఎక్కువ మంది చదివినవి (Most Read)


Please Support