gummadi gummadi lyrics in telugu
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి
చిందాడి చిందాడి తుల్లిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి
వద్దంటే వినదే పగలంతా ఆడిపాడి ముద్దయిన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి పడుకోదే పన్నెండైన ఏం చేయాలి
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి
యెన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేనో ఎవరినెవరు లాలిస్తున్నారో
చిత్రంగా చూస్తుందే నీ కన్నతల్లి పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి
వర్షంలో తడిసొచ్చి హై రే హై అనుకుందామా రేపుదయం జలుబొచ్చి హాచి హాచి అందామా ఓ వంక నీకు ఓ వంక నాకు అవిరి పడుతూనే మీ మమ్మీ
హై పిచ్లో మ్యూజిక్ అల్లే తిడుతుంటుందే మన తుమ్ములు డ్యూయెటల్లే వినబడుతుంటే
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి
వద్దంటే వినదే పగలంతా ఆడిపాడి ముద్దయిన తినదే పరిగెత్తే పైడి లేడి
చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి పడుకోదే పన్నెండైన ఏం చేయాలి
పాట: గుమ్మడి గుమ్మాడి మూవీ:- డాడీ గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి గాయకులు: వివేక్ హరిహరన్