Lyrics: Ee Velalo Neevu (ఈ వేళలో నీవు.. ఏం చేస్తూ ఉంటావు..)


Lyrics: Ee Velalo Neevu

ఈ వేళలో నీవు.. ఏం చేస్తూ ఉంటావు.. అనుకుంటు వుంటాను.. ప్రతి నిమిషము నేను.. నా గుండె ఏనాడో.. చేయి జారీ పోయింది.. నీ నీడగ మారి.. నా వైపు రానంది.. దూరాన ఉంటూనే.. ఏం మాయో చేసావు

ఈ వేళలో నీవు.. ఏం చేస్తూ ఉంటావు.. అనుకుంటు వుంటాను.. ప్రతి నిమిషము నేను..

నడి రేయిలో నీవు.. నిదరైనా రానీవు.. గడిపేదెలా కాలమూ.. గడిపేదెలా కాలము.. పగలైన కాసేపు.. పని చేసుకోనీవు.. నీ మీదనే.. ధ్యానమూ.. నీ మీదనే ధ్యానము..

ఏ వైపు చూస్తున్నా.. నీ రూపే తోచింది.. నువ్వు కాక వేరేది.. కనిపించనంటోంది.. ఈ ఇంద్రజాలాన్ని.. నీవేగా చేసింది..

నీ పేరులో ఏదో.. ప్రియమైన కైపుంది.. నీ మాట వింటూనే.. ఏం తోచనీకుంది.. నీ మీద ఆశేదో.. నను నిల్వనీకుంది.. మతి పోయి నేనుంటే.. నువ్వు నవ్వుకుంటావు..

సంబంధిత కథనాలు (Related Articles)

ఎక్కువ మంది చదివినవి (Most Read)


Please Support