
Lyrics: అంబారాల వీధిలో.. చిన్ని చందమామరా
అంబారాల వీధిలో.. చిన్ని చందమామరా అందున ఒదిగుందిరా.. చెవుల పిల్లిరా
నీడ నీలి దీవిలో.. నీటి మీద మెరిసెరా ఆ వెన్నెల కాంతిలో.. కూర్మముందిరా
ఆ మాయ తాబేలుకి.. తాంబూలా పేటిక కట్టుందిరా తాపీగా ఈదుకుంటూ.. నీళ్లలో ఏమూలో దాక్కుందిరా తార లాంటి ఆకారం.. తాళమే దానికి వేసుందిరా లెక్కనే పెట్టలేని.. వక్కలే అందులో ఉన్నాయిరా
బుజ్జాయి రారా.. కథ చెబుతా కన్నా.. వినుకోరా నువ్వే.. బజ్జో.. లాలీ జో.. లాలీ జో.. నాన్నా.. సరదాగా ఆడు.. మురిపెంగా ఆడు.. ఎదుగుగింక ఎదుగు.. ఎదుగు.. ఆ ఆ ఆ ఆ ఏ ఏ ఏ ఏ
నీ సుదూర దారిలో.. ఆగకుండా సాగిపో చెయ్యి పట్టి చూపగా.. తోడులేరని
ఎదురు నీకు లేదులే.. అడ్డు నీకు రాదులే దారినిచ్చి జరుగులే.. నీటి అలలివే
నిశ్చింత గానే ఉండు.. గాలులే నొప్పిని తీర్చ రావా ఆకాశ నక్షత్రాలే.. దిక్కుల్నే చూపెట్టవచ్చులేరా
నీ ముందు అగ్గి పుట్టె.. చీకట్లే పారదోల కదిలే నువ్వొక్క విత్తు వేస్తే.. ఈ మన్ను అడవల్లే మార్చేయదా
బుజ్జాయి రారా.. కథ చెబుతా కన్నా వినుకోరా నువ్వే.. బజ్జో.. లాలీ జో.. లాలీ జో.. నాన్నా సరదాగా ఆడు.. మురిపెంగా ఆడు ఎదుగుగింక ఎదుగు.. ఎదుగు..
నిలవరా.. నిలవరా పరుగునా.. లే.. కదలరా నిలవరా.. నిలవరా.. జగమునే నువ్ గెలవరా..
చిత్రం: ARM (2024) గాత్రం: Sindhuri Vishal రచన: Krishna Kanth