లిరిక్స్ (Lyrics): అదివో అల్లదివో శ్రీహరివాసము.. పదివేల శేషుల పడగలమయము


Adivo Alladivo Sri Hari Vasamu Lyrics in Telugu

పల్లవి: అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము

చరణం 1: అదె వేంకటాచల మఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్యనివాస మఖిలమునులకు అదె చూడుడదె మ్రొక్కుడానందమయము

చరణం 2: చెంగట నల్లదివో శేషాచలము నింగి నున్నదేవతల నిజవాసము ముంగిట నల్లదివో మూలనున్నధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము

చరణం 3: కైవల్యపదము వేంకటనగమదివో శ్రీ వేంకటపతికి సిరులైనవి భావింప సకలసంపదరూపమదివో పావనములకెల్ల పావనమయము

సంబంధిత కథనాలు (Related Articles)

ఎక్కువ మంది చదివినవి (Most Read)


Please Support