
Alanati ramachandhrudu lyrics in telugu
ఆ… ఆ… ఆ… ఆ… అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి అ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి అ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి
ఆ… ఆ… ఆ… ఆ… తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి
చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు పచ్చని మెడపై వెచ్చగ వ్రాసెను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపున ముద్దగా తడిసిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ… అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కళగల జంటని పదిమంది చూడండి తళతళ మెరిసిన ఆనందపు తడిచూపుల అక్షితలేయండి