ఐ.పి. (Insolvency Petition) దివాళా అంటే ఎమిటీ? ఎప్పుడు పెడతారు? దాని ప్రొసీజర్ ఎమిటీ?


Insolvency Petition

ఆర్ధికంగా చితికిపోయి ఆస్థికి మించిన అప్పులు ఉండి చెల్లించలేక ఇబ్బంది పడుతున్నవారికి చట్టం కలిపించే రక్షణే ఐ.పి. (దివాళా).

కరోనా వల్ల గత కొంత కాలంగా ఆర్ధికంగా చితికిపోయి ఆస్థికి మించిన అప్పులు ఉండి చెల్లించలేక ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరూ చట్టం ద్వారా ఐ.పి. రూపం లో రక్షణ పొందవచ్చు! అందుకే ప్రస్తుతం ఐ.పి. కి అంత ప్రాధాన్యత కనుక ప్రతి ఒక్కరూ తప్పక చదవండి!

ఒక వ్యక్తి లేదా సంస్థ తన ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువగా ఉన్నాయని, తాము ఆ అప్పులను తీర్చలేమని కోర్టులో వేసే కేసునే ఐ.పీ. అంటారు.

IP అంటే Insolvency Petition. పిటీషన్ అంటే అభ్యర్థన.

ఇన్ సొల్వెన్సీ అంటే దివాళా తీయడం. ఐ.పి. పెట్టడం అంటే సివిల్ డెత్ అని అంటారు. అంటే అతను భౌతికంగా ఉన్నా కూడా సంఘం దృష్టిలో లేనట్టే!

కరోనా వల్ల ప్రపంచం వ్యాప్తంగా వ్యక్తులకు సంస్థలకు తీవ్ర నష్టాలు వచ్చాయి. మరి ముఖ్యంగా కరోనా వల్ల మన ఇండియాలో ప్రస్తుతం రైతులు, కార్మికులు, వ్యాపారస్తులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి ఆస్థికి మించిన అప్పులు ఉండి వాటిని తీర్చలేక కొందరు అవమానభారంతో ఆత్మఅత్యలు చేసుకుంటున్నారు.

మరికొందరు ఎమిచెయ్యాలో అర్ధం కాక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

అలాంటి వారి కోసమే చట్టం కల్పించిన ఒక ఆప్షన్ ఐ.పి. కనుక ఎవరికైనా ఆస్థికి మించిన అప్పులు ఉండి ఉంటే, ఆత్మఅత్య చేసుకోవాలనే ఆలోచన మానుకొని చట్టం కల్పించిన ఐ.పి. అనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొంటారని ఉద్దేశ్యంతో ఈ వ్యాసం అందించటం జరుగుతుంది.

ఒక వ్యక్తి లేదా సంస్థకి ఆస్థికి మించి న అప్పులు ఉండి (లేక) అప్పు తీర్చగల సామర్ధ్యానికి మించి అప్పులు ఉన్నట్లయితే వారు ఐ పి. దాఖలు చేసుకోవచ్చు.

కోర్టులో IP దాఖలు చేశాక కోర్టు ప్రొసీజర్ ఎమిటీ అంటే?

కోర్టు ఈ సంస్థ లేదా వ్యక్తి యొక్క ఆర్ధిక వివరాలు తనిఖీ చేసి, వారిని Insolvent గా ధ్రువ పరుస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ, ఒక రిసీవర్ ని నియమిస్తుంది.

ఆ రిసీవర్ ఆస్తులని అమ్మి, ఆ నిష్పత్తి లో అప్పులకి చెల్లింపులు చేసి ఆ విషయాన్ని పూర్తి చేస్తారు. అందుకు కొంత గడువు ఉంటుంది.

ఐపీ పెట్టడం అనేది ఎందుకంత చర్చనీయంగా ఉంటుంది అంటే, ఆ వ్యక్తి కి ఇచ్చిన అప్పు, పూర్తిగా వసూలు అయ్యే అవకాశం ఉండదు, దొరికిన ఏ కాస్తతో అయినా సర్దుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కనుక, ఋణదాతలకి తమ దగ్గర అప్పు తీసుకున్న వారు ఐపీ పెడితే ఇబ్బందే.

ఆస్థి కి మించిన అప్పులు ఉండి లేదా అప్పులు తీర్చలేక ఎవరు చనిపోకూడదు అనే ఉద్దేశ్యంతో అలాంటి వారి కోసమే ఐ.పి. రూపంలో చటం ద్వారా రక్షణ కలిపిస్తుంది. అందుకే ఐ.పీ. కి అంత ప్రాధాన్యత, అంత విలువ!

సంబంధిత కథనాలు (Related Articles)

ఎక్కువ మంది చదివినవి (Most Read)


Please Support