
Lyrics: Jamu rathiri jabilamma song
పల్లవి : జమురాతిరి.. జాబిలమ్మ.. జోలపాడనా.. ఇలా.. జోరుగాలిలో.. జాజికొమ్మ.. జారనీయకే కలా.. వయ్యారి వాలుకళ్ళలోన.. వరాల వెండిపూల వాన స్వరాల ఊయలుగువేల.. జమురాతిరి.. జాబిలమ్మ.. జోలపాడనా.. ఇలా..
చరణం 1 : కుహు కుహు.. సరాగాలే శ్రుతులుగా.. కుశలమా.. అనే స్నేహం పిలువాగా.. కిల కిల.. సమీపించే సడులతో.. ప్రతి పొద.. పదాలేవో పలుకగా.. కునుకురాక బుట్ట బొమ్మ గుబులుగున్నది.. వనము లేచి వద్దకొచ్చి నిద్రపుచ్చని.. జమురాతిరి.. జాబిలమ్మ.. జోలపాడనా.. ఇలా..
చరణం 2 : మనసులో భయాలన్నీ మరిచిపో.. మగతలో మరోలోకం తెరుచుకో.. కలలతో ఉషాతీరం వెతుకుతూ.. నిదురతో నిశారాణి నడిచిపో.. చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి.. కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికీ.. జమురాతిరి.. జాబిలమ్మ.. జోలపాడనా.. ఇలా..