లిరిక్స్ : రామ చక్కని సీతకి.. అరచేత గోరింట..


Lyrics: రామ చక్కని సీతకి..

నీల గగన.. ఘనవిచలన.. ధరణిజ శ్రీ రమణ.. ఆ.. ఆ.. ఆ.. మధుర వదన.. నళిన నయన.. మనవి వినరా రామా.. ఆ.. ఆ.. ఆ..

పల్లవి: రామ చక్కని సీతకి.. అరచేత గోరింట.. ఇంత చక్కని చుక్కకీ.. ఇంకెవరూ మొగుడంట.. రామ చక్కని సీతకీ..

చరణం 1: ఉడత వీపున వేలు విడిచిన.. పుడమి అల్లుడు రాముడే.. ఎడమ చేతను శివుని విల్లును.. ఎత్తిన ఆ రాముడే.. ఎత్తగలడా సీత జడనూ.. తాళి కట్టే వేళలో...? రామ చక్కని సీతకీ...

చరణం 2: ఎర్రజాబిలి చేయిగిల్లి.. రాముడేడని అడుగుతుంటే.. చూడలేదని పెదవి చెప్పే.. చెప్పలేమని కనులు చెప్పే.. నల్లపూసైనాడు దేవుడు.. నల్లనీ రఘూరాముడూ.. రామ చక్కని సీతకీ...

చరణం 3: చుక్కనడిగా దిక్కునడిగా.. చెమ్మగిల్లిన చూపునడిగా.. నీరు పొంగిన కనులలోన.. నీటి తెరలే అడ్డునిలిచే.. చూసుకోమని మనసు తెలిపే.. మనసు మాటలు కాదుగా.. రామ చక్కని సీతకీ...

ఇందువదనా.. కుందరాదనా.. మందగమనా.. భామా.. ఎందువలనా.. ఇందువదనా.. ఇంత మదనా.. ప్రేమా!!

చిత్రం : గోదావరి రచన : వేటూరి, సంగీతం : K. M. రాధా కృష్ణన్ గానం : గాయత్రీ ఆశోకన్

సంబంధిత కథనాలు (Related Articles)

ఎక్కువ మంది చదివినవి (Most Read)


Please Support