
Annamayya: Kondalalo nelakonna koneti rayadu vadu song lyrics
పల్లవి : కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు..
చరణం 1 : కుమ్మర దాసుడైన.. కురువరతినంబి యిమ్మన్న వరములెల్ల నిచ్చినవాడు.. దొమ్ములు సేసినయట్టి.. తొండమాన్ చక్కురవర్తి.. 2 రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు.. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు
చరణం 2 : అచ్చపు వేడుకతోడ.. ననంతాళువారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు.. మచ్చిక దొలక దిరుమలనంబి తోడుత.. 2 నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాడు.. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు
చరణం 3 : కంచిలోన నుండ.. దిరుకచ్చినంబి మీద కరుణించి తనయెడకు రప్పించిన వాడు.. ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు 2 మంచివాడై కరుణ బాలించినవాడు.. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు