Lyrics: ఏదో ఒక రాగం పిలిచిందీ వేళా - Edo oka ragam song lyrics in telugu

Edo oka ragam song lyrics in telugu
Edo oka ragam song lyrics in telugu

పల్లవి: ఏదో ఒక రాగం పిలిచిందీ వేళా నాలో నిదురించే గతమంతా కదిలేలా ఏదో ఒక రాగం పిలిచిందీ వేళా నాలో నిదురించే గతమంతా కదిలేలా నా చూపుల దారులలో.. చిరుదివ్వెలు వెలిగేలా నా ఊపిరి ఊయలలో.. చిరు నవ్వులు చిలికేలా

జ్ఞాపకాలె మైమరపూ.. జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాలె నిట్టూర్పూ.. జ్ఞాపకాలే ఓదార్పు ఎదో ఒక రాగం పిలిచింది వేళా నాలో నిదురించే గతమంతా కదిలేలా

చరణం 1: అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే రా అమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే అమ్మ కళ్ళలో అపుడపుడూ చెమరింతలు జ్ఞాపకమే అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం

ఏదో ఒక రాగం పిలిచిందీ వేళా నాలో నిదురించే గతమంతా కదిలేలా

చరణం 2: గుళ్లో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే బళ్ళో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే నెమలి కళ్ళనే దాచే చోటు జ్ఞాపకం జామపళ్లనే దోచే తోట జ్ఞాపకం

ఏదో ఒక రాగం పిలిచిందీ వేళా నాలో నిదురించే గతమంతా కదిలేలా నా చూపుల దారులలో.. చిరుదివ్వెలు వెలిగేలా నా ఊపిరి ఊయలలో.. చిరు నవ్వులు చిలికేలా

జ్ఞాపకాలె మైమరపూ.. జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాలె నిట్టూర్పూ.. జ్ఞాపకాలే ఓదార్పు ఏదో ఒక రాగం పిలిచింది వేళా నాలో నిదురించే గతమంతా కదిలేలా

చిత్రం: రాజా సంగీతం: ఎస్ ఏ రాజ్ కుమార్ రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం: కే ఎస్ చిత్ర