IISER (ఐసర్) లో సైన్స్ కోర్సులు (IISER Notification)


IISER Notification 2025

ఇంజనీరింగ్ మెడిసిన్ లపై ఆసక్తి లేనివారికి, సైన్స్ రంగంలో రాణించాలనుకునేవారికి, శాస్త్రవేత్తలు కావాలనుకునేవారికి, పరిశోధనా రంగంలో అడుగుపెట్టాలనుకునే వారికి ఇదొక సువర్ణావకాశం ఇటీవల విడుదలైన IISER (ఐసర్) నోటిఫికేషన్. దేశంలో పరిశోధనలతో ముడిపడిన చదువుల కొరత తీర్చడానికి కేంద్రం ప్రారంభించిన విశిష్ఠ విద్యాలయాలు ఐఐఎస్ఈఆర్ (ఐసర్)లు. వీటిలో ఇంజనీరింగ్ కానీ ఇంజనీరింగ్, మెడిసిన్ కానీ మెడిసిన్ కోర్సులను అందిస్తున్నాయి. ప్రారంభంనుంచే వినూత్న కరికులంతో పరిశోధనాత్మకమైన కోర్సులను అందిస్తూ దేశానికి అవసరమైన శాస్త్రవేత్తల వేదికగా నిలుస్తున్నాయి ఈ విద్యాలయాలు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఈ ఐసర్ లలో ప్రవేశాల ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా..

ఐఐఎస్ఈఆర్

సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ రంగాలను మిళితం చేసి అత్యున్నత విద్యను అందించటానికి కేంద్రం ఐఐఎస్ఈఆర్ (ఐసర్) లను ఏర్పాటు చేసింది. మొదట 2006లో కోలకతా, పుణెలలో ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో ఏడు ఐసర్ లు ఉన్నాయి.

ఐసర్ క్యాంపస్ లు

భోపాల్, బెర్హంపూర్, కోలకతా, మొహాలీ, పూణే, తిరువనంతపురం, తిరుపతిల్లో ఈ సంస్థ క్యాంపస్ లు ఉన్నాయి.

ఆఫర్ చేస్తున్న కోర్సులు

బీఎస్, బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ, బీటెక్ ప్రోగ్రాం.

ఐదేండ్ల బీఎస్-ఎంఎస్ (డ్యూయల్ డిగ్రీ) ఇన్ కంప్యూటేషనల్ అండ్ డేటా సైన్సెస్ - ఐసర్ కోలకతా.

నాలుగేండ్ల బీఎస్ డిగ్రీ (ఎకనామిక్ సైన్సెస్) - ఐసర్ భోపాల్

నాలుగేండ్ల బీఎస్ (ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సైన్సెస్) - ఐసర్ తిరుపతి

నాలుగేండ్ల బీటెక్ (కెమికల్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్) - ఐసర్ భోపాల్

ఈ కోర్సులు పూర్తి రెసిడెన్షియల్ ఫుల్ టైం కోర్సులు.

అర్హతలు

కనీసం 60 శాతం మార్కులతో 2023/2024 లో ఇంటర్ (సైన్స్ స్ట్రీమ్) ఉత్తీర్ణులు. 2025లో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసినవారు/ రాస్తున్న వారు అర్హులు. (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ సీ అభ్యర్థులు అయితే 55 శాతం మార్కులు వస్తే సరిపోతుంది).

ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఏవైనా మూడు సబ్జెక్టులు చదివి ఉండాలి.

కంప్యూటేషనల్ అండ్ డేటా సైన్సెస్, ఎకనామిక్ సైన్సెస్, స్టాటిస్టికల్ సైన్సెస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మ్యాథ్స్ తప్పనిసరిగా ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

ప్రవేశాలు కల్పించే విధానం

ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఐఏటీ) - 2025 ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారు.

పరీక్ష విధానం

- 60 ప్రశ్నలు ఇస్తారు. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ నుంచి 15 ప్రశ్నల చొప్పున ఇస్తారు. - పరీక్ష కాల వ్యవధి 180 నిముషాలు. - ముల్తిప్లె ఛాయస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. - ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. మొత్తం 240 మార్కులకు పరీక్ష ఉంటుంది. - నెగేటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.

నోట్:

ఐఏటీ 2025 స్కోరుతో బెంగుళూరులోని ఐఐఎస్ఈఆర్ లో బీఎస్ రీసెర్చ్, ఐఐటీ మద్రాసులో బీఎస్ మెడికల్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్ ప్రోగ్రాంలో ప్రవేశాలు కల్పిస్తారు. వీటికి సంబందించిన వివరాలు ఆయా వెబ్ సైట్ లలో చూడవచ్చు.

బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ సీట్ల వివరాలు

ఐసర్ క్యాంపస్ సీట్ల సంఖ్య

బెర్హంపూర్ 300 భోపాల్ 300 కోలకతా 280 కోలకతా (బీఎస్-ఎంఎస్ సీడీఎస్) 30 మొహాలీ 270 పూణే 288 తిరువనంతపురం 320 తిరుపతి 350

మొత్తం 2138

బీఎస్/బీటెక్ డిగ్రీ సీట్ల సంఖ్య

ఐసర్ భోపాల్ (బీటెక్) 140 ఐసర్ భోపాల్ (ఎకనామిక్స్ సైన్సెస్) 35 ఐసర్ తిరుపతి (ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సైన్సెస్) 50

మొత్తం సీట్ల సంఖ్య 225

ముఖ్యమైన తీదీలు

దరఖాస్తు: ఆన్లైన్ లో చివరి తేదీ: ఏప్రిల్ 15 దరఖాస్తు సవరణ తేదీలు: ఏప్రిల్ 21-22 హాల్ టిక్కెట్ల డౌన్ లోడింగ్: మే 15 నుంచి ఐఐఎస్ఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్: మే 25 ఆన్సర్ కీ విడుదల: మే 25 వెబ్సైటు: https://iiseradmission.in