IPPB Jobs: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో ఉద్యోగాలు (India Post Payment Bank Jobs)
IPPB - Indian Post Payments Bank Jobs
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో 41 జూనియర్ అసోసియేట్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఫిబ్రవరి 28, 2023 దరఖాస్తు చివరి తేది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు : 41 చీఫ్ మేనేజర్ (IT) : 2 అసిస్టెంట్ మేనేజర్ (IT) : 10 మేనేజర్ (IT) : 9 సీనియర్ మేనేజర్ (IT) : 5 జూనియర్ అసోసియేట్ (IT) : 15
విద్యార్హతలు (Required Educational Qualifications) :
ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, ఎంఎస్‌సీ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఎస్‌సీ ఇన్ కంప్యూటర్ సైన్స్, బీసీఏ, ఎంసీఏ లాంటి కోర్సులు చదివిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
అనుభవం (Experience) :
మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏఎంఎల్, రిస్క్, అప్లికేషన్ సపోర్ట్ ఫర్ సీబీఎస్, సీఐఎస్, టెస్టింగ్ అండ్ రిలీజ్ లాంటి విభాగాల్లో కనీసం 3 నుంచి 5 ఏళ్ల అనుభవం ఉండాలి.
వయస్సు (Age Limit) :
55 ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపిక విధానం (Recruiting Procedure) :
ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు, అవసరాన్ని బట్టి గ్రూప్ డిస్కషన్ లేదా ఆన్‌లైన్ టెస్ట్ కూడా నిర్వహించవచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ (Last Date to Apply ) :
ఫిబ్రవరి 28, 2023
IPPB Recruitment 2023 - దరఖాస్తు విధానం (How to apply) :
Step 1- ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా IPPB అధికారిక వెబ్‌సైట్ https://www.ippbonline.com/ ఓపెన్ చేయాలి. Step 2- Careers సెక్షన్‌లో Information Technology Vacancies సెక్షన్‌లో నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి. Step 3- అదే సెక్షన్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేయాలి. Step 4- అప్లికేషన్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి. Step 5- careers@ippbonline.in మెయిల్ ఐడీకి అప్లికేషన్స్ పంపాలి.
అభ్యర్థులు 2023 ఫిబ్రవరి 28 లోగా దరఖాస్తుల్ని మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే careers@ippbonline.in మెయిల్ ఐడీలో సంప్రదించాలి.
Note: ExtraBuzz.in is not responsible for any fraud notifications posted here, and not responsible for any payment you made for the companies offering jobs here, Be careful before proceeding to apply the jobs and for any payments if you make.