Lyrics: దారిపొంటత్తుండు.. దవ్వ దవ్వత్తుండు.. దారిద్దునా.. పోనిద్దునా - Daripontathundu Song Lyrics in Telugu
Daripontothundu song lyrics in telugu
అహ.. దారిపొంటత్తుండు.. దవ్వ దవ్వత్తుండు దారిద్దునా.. పోనిద్దునా జోరు మీదత్తుండు.. కారు మీదత్తుండు తోలేద్దునా పోనీ ఉకుంద్దునా
దారిపొంటత్తుండు.. రానిద్దునా తొవ్వ పొంటత్తుండు.. పోనిద్దునా నాఎనక నాఎనక నాఎనక నాఎనక నా ఎనక పడుతుండు.. నా ముందుటుంటుండు సందిద్దునా.. వంద వడ్డిందునా ఇనుకుంట పోతాండు.. అనుకుంట వత్తాండు బందైదునా.. బంధమై చూపనా
అహా.. గాలి గాలిజేత్తుండు.. గండమై కూసుండు గాలిద్దునా.. అహా.. అహ అహా.. గాలి గాలిజేత్తుండు.. గండమై కూసుండు గాలిద్దునా.. ఇన్ని గోలిద్దునా రాయే పోయే అంటుండు.. రౌసు పెట్టుకుంటుండు రమ్మందునా.. విన్నీ పొమ్మందునా గాలి గాలిజేత్తుండు.. గరమైదునా సోయి లేకంటుండు.. సందిద్దునా గాలిగాలి గాలిగాలి గాలిగాలి గాలిగాలి గాలిగాలి చేత్తుండు.. గడుసుదాన్ని అంటుండు తల తింటడే.. తరమైతలే సోయి లేకంటుండు.. సోపతైతంటుండు సోయి ఉన్నదో.. వీనికి సోకున్నదో
ఆహా తిప్పిచుకుంటుండు.. తప్పిచుకుంటుండు ఒప్పిద్దునా.. వీణ్ణి తప్పిద్దునా ఈడైతనంటుండు.. జోడైతనంటుండు ఇరిసేద్దునా.. వీణ్ణి మరిసుందునా తిప్పిచుకుంటుండు.. తింగరోడే తప్పించుకుంటుండు.. తిక్కలోడే వర్రిచ్చి వర్రిచ్చి వర్రిచ్చి వర్రిచ్చి వర్రిచ్చికుంటుండు.. జర్రాగే అంటుండు రానియ్యడే.. ముందుకోనియ్యడే ఆగమైతంటుండు.. అంగడైతంటుండు ఏగైతడో.. వీడేమైతడో
ఆహా.. ఎట్లైతే గట్లాయే.. ఎంబడే ఉండోయి వెనక రావోయి.. నా వెంట రావోయ్ నీ మీద మనసయింది.. వరసైతే కలిసింది ఇడిసుండకోయ్.. పిల్లగ మరిసుండకోయ్ నాగుంబాము కోపమోడే.. జెరూ పోతు పిరుకోడే అగ్గగ్గొ అగ్గగ్గొ అగ్గగ్గొ అగ్గగ్గొ అగ్గగ్గొ కొమరెల్లి మల్లన్న.. కొలిసీ మొక్కుతున్న కంటసూడే.. మమ్ము జంట చెయ్యే ఐలేని మల్లన్న.. ఆశతొ మొక్కుతున్న ఆన్ని కలిసె తొవ్వ.. చూపరాదే పర్వతాల మల్లన్న.. పప్పతి పడుతున్న మరవబాకే.. మమ్ము కలుపరాదే ఎములాడ రాజన్న.. కోడినే కడుతాను ఎంబటుండేటోన్ని.. పిలవరాదే
సంగీతం : మదీన్ SK (Madeen SK) సాహిత్యం: మామిడి మౌనిక (Mamidi Mounika) గానం: మామిడి మౌనిక (Mamidi Mounika)