Border Gavaskar 2nd Test Match: ఆస్ట్రేలియాపై వరుసగా రెండో టెస్టులోనూ భారత్ విజయాన్ని అందుకుంది.
India vs Australia 2nd Test Match
ఆస్ట్రేలియాపై వరుసగా రెండో టెస్టులోనూ భారత్ విజయాన్ని అందుకుంది. ఢిల్లీ వేదికగా ఈరోజు ముగిసిన టెస్టు మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబర్చిన టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. దాంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 2 - 0 తో ఆధిక్యంలో నిలవగా, మూడో టెస్టు మ్యాచ్ ఇండోర్ వేదికగా మార్చి 1 నుంచి ప్రారంభంకానుంది.
రెండో టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీమ్ మొదటి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకి ఆలౌటవగా, అనంతరం భారత్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 262 పరుగులకి ఆలౌటైంది. దాంతో ఒక్క పరుగు ఆధిక్యాన్ని అందుకున్న ఆస్ట్రేలియా టీమ్ ఈరోజు రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే ఆలౌటైంది. ఓవరాల్‌గా 115 పరుగుల టార్గెట్ భారత్ ముందు నిలిచింది, ఒక సెషన్‌లోనే భారత్ జట్టు లక్ష్యాన్ని ఛేదించేసింది.