భగవద్గీత - శ్లోకం 7: అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ | నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ||

Bhagavad Geetha - Telugu - Sloka - 0007
Bhagavad Geetha - Telugu - Sloka - 0007

శ్లోకం 7:

అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ | నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ||

ప్రతిపదార్థం:

అస్మాకం = మన యొక్క; తు = కాని; విశిష్టాః = ప్రధానముగా శక్తిమంతులైనవారు; యే = ఎవరో; తాన్ = వారిని; నిబోధ = గుర్తింపుము; ద్విజోత్తమ = ఓ బ్రాహ్మణశ్రేష్ఠుడా; నాయకాః = నాయకులు; మమ = నా యొక్క; సైన్యస్య = సేనల; సంజ్ఞార్థం = తెలియుట కొరకు; తాన్ = వారిని గూర్చి: బ్రవీమి = తెలుపుచున్నాను; తే = మీకు;

తాత్పర్యం:

కాని ఓ బ్రాహ్మణోత్తమా! నా సేనాబలమును నడుపుటకై ప్రత్యేకముగా యోగ్యులైనట్టి నాయకులను గూర్చి మీ కొరకై నేను తెలియజేసెదను.

భాష్యము:

ఓ బ్రాహ్మణోత్తమా, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము, వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు. మీ ఎఱుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను.