భగవద్గీత - శ్లోకం 6: యుధామన్యుశ్చ విక్రాన్త ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ | సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ||

Bhagavad Geetha - Telugu - Sloka - 0006
Bhagavad Geetha - Telugu - Sloka - 0006

శ్లోకం 6:

యుధామన్యుశ్చ విక్రాన్త ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ | సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ||

ప్రతిపదార్థం:

యుధామన్యుః = యుధామన్యుడు; చ = మరియు; విక్రాన్తః = పరాక్రమవంతుడైన; ఉత్తమౌజాః = ఉత్తమౌజుడు; చ = మరియు; వీర్యవాన్ = గొప్ప శక్తిమంతుడైన; సౌభద్రః = సుభద్రాతనయుడు; ద్రౌపదేయాః = ద్రౌపది పుత్రులును; చ = మరియు; సర్వే = అందరును; ఏవ = నిశ్చయముగా; మహారథాః = మహారథులు;

తాత్పర్యం:

పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలియైన ఉత్తమౌజుడు, సుభద్రా తనయుడు, ద్రౌపదికుమారులును అందున్నారు. ఈ వీరులందరును మహారథులు.

భాష్యము:

ఈ పాండవుల సైన్యం ధైర్య సాహసవంతులు అస్త్ర విద్యలో నిపుణులు, శౌర్యంలో భీమార్జున సమానులు ఉన్నారు. సాత్య విరాటుడు, ధ్రుపదుడు, దృష్టకేతుడు, చేకితాసుడు, కాశీ రాజు పురుజిత్తు, శైబుడు, యుధామాన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు కూడా ఉన్నారు, వీళ్ళంతా మహారధులే.