భగవద్గీత - శ్లోకం 5: ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ | పురుజిత్ కున్తిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ||

Bhagavad Geetha - Telugu - Sloka - 0005
Bhagavad Geetha - Telugu - Sloka - 0005

శ్లోకం 5:

ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ | పురుజిత్ కున్తిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ||

ప్రతిపదార్థం:

ధృష్టకేతుః = ధృష్ట కేతువు; చేకితానః = చేకితానుడు; కాశీరాజః = కాశీరాజు; చ = కూడా; వీర్యవాన్ = శక్తిమంతుడైన; పురుజిత్ = పురుజిత్తు; కున్తిభోజః = కుంతిభోజుడు; చ = మరియు; శైబ్యః = శైబ్యుడు; చ = మరియు; నరపుంగవః = నరులలో శ్రేష్ఠుడైన;

తాత్పర్యం:

ధృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతీభోజుడు, శైబ్యుడు వంటి శూరులైన మహాయోధులును అందున్నారు.

భాష్యము:

ఈ పాండవుల సైన్యం ధైర్య సాహసవంతులు అస్త్ర విద్యలో నిపుణులు, శౌర్యంలో భీమార్జున సమానులు ఉన్నారు. సాత్య విరాటుడు, ధ్రుపదుడు, దృష్టకేతుడు, చేకితాసుడు, కాశీ రాజు పురుజిత్తు, శైబుడు, యుధామాన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు కూడా ఉన్నారు, వీళ్ళంతా మహారధులే.