భగవద్గీత - శ్లోకం 4: అత్ర శూరా మహేశ్వాసా భీమార్జునసమా యుధి | తమ యుయునో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ||
Bhagavad Geetha - Telugu - Sloka - 0004
శ్లోకం 4:
అత్ర శూరా మహేశ్వాసా భీమార్జునసమా యుధి | తమ యుయునో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ||
ప్రతిపదార్థం:
అత్ర = ఇచ్చట; శూరాః = శూరులు; మహేశ్వాసాః = గొప్ప ధనుర్ధరులు; భీమార్జున = భీమార్జునులకు; సమా = సములైనవారు; యుధి = యుద్ధము నందు; యుయుధానః = యుయుధానుడు; విరాట = విరాటుడు; చ = కూడా; ద్రుపద = ద్రుపదుడు; చ = కూడా; మహారథ = మహారథుడైన;
తాత్పర్యం:
ఈ సైన్యమునందు భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్ధరులు పెక్కురు గలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగువారు అటువంటి మహాయోధులు.
భాష్యము:
యుద్ధవిద్య యందు ద్రోణాచార్యుని గొప్పశక్తి దృష్ట్యా ధృష్టద్యుమ్నుడు ముఖ్యమైన అవరోధము కాకున్నను భయమునకు కారణమైనవారు పెక్కురు కలరు. విజయపథములో వారు గొప్ప అవరోధముల వంటివారని దుర్యోధనుడు తెలియజేయుచున్నాడు. వారిలో ప్రతియొక్కరును భీముడు మరియు అర్జునుని వలె నిరోధింపశక్యము కానివారగుటయే అందులకు కారణము. భీమార్జునుల శక్తిని తెలిసియుండుట చేతనే ఇతరులను వారితో అతడు పోల్చిచూపెను.