Ghibli Art ని వాడటం మంచిదేనా? అది ఎలా పనిచేస్తుంది? దానివల్ల ప్రమాదమేంటి?


What is Ghibli Art | Pros and Cons

ఈ మధ్య ట్రెండింగ్ గా మారిన Ghibli ఆర్ట్ గురించి అందరికీ తెలిసిందే. ఇది ప్రస్తుతం నెట్టింట్లో ట్రేండింగ్ లో ఉందంటే యువత దీనికి ఎంత అడిక్ట్ అయ్యారో అర్ధం చేస్కోవచ్చు. కానీ దీని వల్ల రానున్న రోజుల్లో ఎలాంటి సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది కూడా కొంచెం అవగాహన కలిగి ఉండాలి.

ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (AI) కి మన ఫోటోలు ఇచ్చి వాటిని Ghibli స్టైల్స్ లోకి మార్చడం అనేది మనకి ఒక సరదా అవి చూడడానికి అందంగా ఇంకా సరదాగా కూడా కనిపిస్తాయి. కానీ ఇది ఒక రకంగా మనకి ప్రమాదమే.

AI గిబ్లీ ఆర్ట్ అనేది ఒక ప్రత్యేకమైన డిజిటల్ ఆర్ట్ ఫార్మాట్. ఇది Artificial Intelligence (AI) Tools ని ఉపయోగించి సాధారణ ఫోటోలను యానిమేటెడ్, పెయింటింగ్-స్టైల్ లేదా ఫాంటసీ-స్టైల్ లోకి మార్చే ప్రక్రియ. ఈ ఆర్ట్ స్టైల్ జపాన్ కి చెందిన ప్రముఖ స్టూడియో Ghibli నుంచి వచ్చింది, అందుకే దీనిని "Ghibli Art" అని పిలుస్తారు.

AI ఆధారిత యాప్స్ లేదా టూల్స్ మన ఫోటోలను స్కాన్ చేసి, Machine Learning Algorithms ద్వారా వాటిపై డిజిటల్ బ్రష్‌స్ట్రోక్స్, లైట్ ఎఫెక్ట్స్, మరియు ప్రత్యేకమైన అనిమేషన్-స్టైల్ కలర్స్ అప్లై చేస్తాయి. ఇది చాలా వేగంగా పని చేస్తుంది. కొన్ని క్షణాల్లోనే మన ఫోటోలని ఎంతో అద్భుతమైన మరియు యానిమేటెడ్ ఆర్టవర్క్ గా మారుస్తుంది.

AI కి మన ఫోటోలు ఇవ్వడం వల్ల మన ఫోటోలని స్టోర్ చేసుకొని వాటిని ఫ్యూచర్ లో మిస్ యూజ్ చేసే అవకాశం ఉంది.

కొన్ని యాప్స్ Facial Recognition కోసం మన ఫోటోలను వాళ్ళ సర్వర్స్ లో సేవ్ చేసుకోవచ్చు. Data Leaks జరిగితే, మన వ్యక్తిగత ఫోటోలు hackers చేతికి చేరే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో వచ్చిన హీరోయిన్ రష్మికది deep fake వీడియో గురించి అందరికీ తెలిసిందే.

ఈ Ghibli ఆర్ట్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఫేస్ చేయాల్సి రావొచ్చు.

AI టూల్స్ ఉపయోగించి రూపొందించిన చిత్రాలను కొన్ని కంపెనీలు వాణిజ్యపరంగా కూడా ఉపయోగించగలవు. AI Models Pre-trained Dataపై ఆధారపడతాయి, అందుకే కొన్నిసార్లు ఫలితాలు ఆశించిన విధంగా రాకపోవచ్చు. కొన్నిసార్లు సహజమైన లేదా అసలైన భావాన్ని కనబర్చలేని చిత్రాలు రూపొందించబడతాయి.

AI ఆధారిత ఆర్ట్ ఎక్కువగా ప్రాచుర్యం పొందితే, Traditional Artists & Paintersకి అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి.

AI గిబ్లీ ఆర్ట్ వినియోగదారులకు కొత్తదనాన్ని, క్రియేటివిటీని అందించినప్పటికీ, Data Privacy, Copyright, మరియు Security Issues ను గమనించాల్సిన అవసరం ఉంది. AI ఆధారిత ఆర్ట్ టూల్స్ ని వినియోగించే ముందు సూచనలు పాటించి, వ్యక్తిగత డేటా రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ, వ్యక్తిగత గోప్యత, మానవ కళాత్మకత, మరియు సాంప్రదాయ ఆర్ట్‌ను రక్షించుకోవడం కూడా చాలా ముఖ్యం!