తల్లిదండ్రులు, టీనేజ్ పిల్లలకు ఇవ్వాల్సిన 13 తప్పనిసరి సూచనలు.
తల్లిదండ్రులు టీనేజ్ పిల్లలకు ఇవ్వాల్సిన 13 తప్పనిసరి సూచనలు
1. దేశ భక్తి అంటే రాజ్యాంగం, చట్టాలను గౌరవించి పాటించడం తప్ప వేరే ఎటువంటిదీ కాదనే సంస్కారాన్ని నేర్పించాలి.
2. ఒక పౌరుడిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం బాధ్యత అని తెలియజేయాలి.
3. హక్కులకు, విధులకు (Rights and Duties) మధ్య ఎలాంటి నైతిక సంబంధం ఉందో వివరించాలి.
4. మనుషులను కులమతప్రాంతీయ బేధాలు లేకుండా సమానంగా చూడాలని ఉదాహరణలతో వివరించాలి.
5. కులం, మతం, ప్రాంతం, దేశాన్ని బట్టి ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే భావనను ఎట్టి పరిస్థితుల్లో దరిచేరనీయకుండా జీవించాలని తెలియజేయాలి.
6. చట్టరీత్యా నేరం కాని ఏ పనీ (Work) తక్కువ కాదు అనే 'డిగ్నిటీ ఆఫ్ లేబర్' ఆలోచనను పెంపొందించాలి.
7. సమస్యను ప్రశ్నించడం, పరిష్కారం కనుగొనడం, చేసే పనిలో నైపుణ్యం (Skill) ప్రదర్శించడం అలవరచాలి.
8. చిన్నా, పెద్దా తేడాలు లేకుండా ఆలోచనలను స్వేచ్ఛగా పంచుకోవడం, మొహమాటాల్ని ఎలా పక్కన పెట్టాలో నేర్పాలి.
9. మూఢనమ్మకాలను విశ్వసించకుండా శాస్త్రీయ దృక్పధాన్ని (Scientific Temper) విస్తృతం చేసుకునేలా సహేతుకత, తర్కం పట్ల అవగాహన కల్పించాలి.
10. సొంత ఆలోచనల్ని కల్గివుండాలని, వ్యక్తిపూజకు, ఆరాధనకు దూరంగా ఉండాలని చెప్పండి.
11. ఒకరితో పోల్చుకునే గుణాన్ని తగ్గించుకొని, వారిలో ఉన్న నైపుణ్యానికి పదును పెట్టడానికి తోడ్పాటు అందివ్వండి.
12. రోజువారీ ప్రపంచాన్ని, సమాజపు ప్రోకడల్ని గమనిస్తూ పుస్తకాల్లో అంశాలకు ఎలా అన్వయించుకోవాలో నేర్పండి.
13. ప్రకృతి పట్ల జాగురతతో వ్యవహరించాలని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని సూచించండి.
మీ టీనేజ్ పిల్లలకు ఈ 13 విషయాలు తప్పకుండా చెప్పండి. వీలైతే కలిసి చర్చించుకోండి. వివక్ష, ఆధిపత్యం, మూర్ఖత్వం లేని భావితరాన్ని ఈ సమాజానికి అందించండి.