Lyrics: నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవె అత్తగారింటికీ - Athagarintiki Folk Song Lyrics in Telugu

Athagaarintiki Song Lyrics in Telugu & English
Athagaarintiki Song Lyrics in Telugu & English

నువ్వు నాకూ కానరావే అనీ ఎవరి కంట్ల పడకుండ నేను వెళ్ళిపోతున్ననే నువ్వు నాతో మాటాడలేవే అనీ ఎవరితో మాటడకుండ నే వెళ్ళిపోతున్ననే నువ్వు ఈ లోకంలో లేనెలేవే అనీ నేనీలోకాన్ని వదిలేసి పోతున్ననే

నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవె అత్తగారింటికీ నే పువ్వులు జల్లుకొని పోతున్ననె కాలే కాటికీ నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవె అత్తగారింటికీ నే పువ్వులు జల్లుకొని పోతున్ననె కాలే కాటికీ

పసుపూ తానాలు నాకు పోయిస్తున్నారే నీ పెదవుల చిరునవ్వై నే పూసే పోతానే జిల్లెడు చెట్టుతో పెళ్ళి చేసేస్తున్నారే నీ తలపై తలువాలు నే పోసేపోతానే

ఎల్లిపోతున్నా.. ఇల్లు ఇడుపును అంతా ఇడిసీ మళ్ళొస్తానో రానో ఈ తోవల నేనే నడిసీ బధురంగుండే నువ్వు.. మళ్ళొస్తానో రానో నవ్వూ.. నన్ను చూసి ఒక్కసారీ

నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవె అత్తగారింటికీ నే పువ్వులు జల్లుకొని పోతున్ననె కాలే కాటికీ నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవె అత్తగారింటికీ నే పువ్వులు జల్లుకొని పోతున్ననె కాలే కాటికీ

పిడికిళ్లతో మన్నే నాపై పోస్తూవున్నారే తలువాలు ఒడిబియ్యాలు నువ్వు పోసుకోవే ఈ మన్ను పరుపుల నేనే పడుకుంటున్నానే ఆ పువ్వుల పరుపుల నువ్వు హాయిగ నిదరోయే

పైసా పైసా అన్నడు కదనే నిన్ను కన్న నాన్నా ఆఖరికి కురిసేది ఆటన చిక్కల నానా పరువూ పరువూ అంటూ తీస్తిరి గదనే పరుగూ పానం పొయినంకా మోగేదే డప్పుల దరువూ

ఉండదె నీకే హానీ.. పిల్లా పాపాలతోనీ హాయిగా బతుకే నువ్వు వందేళ్ళూ

నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవె అత్తగారింటికీ నే పువ్వులు జల్లుకొని పోతున్ననె కాలే కాటికీ నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవె అత్తగారింటికీ నే పువ్వులు జల్లుకొని పోతున్ననె కాలే కాటికీ

Song: అత్త గారి ఇంటికి (Athagaarintiki) Lirics & Singer: బుల్లెట్ బండి లక్ష్మణ్ (Bullet Bandi Laxman) Music: మదీన్ ఎస్.కే. (Madeen S.K.) Cast: కిట్టు పవన్, శిరీష లక్ష్మణ్ (Kittu Pavan, Shirisha Laxman)

వీక్షించండి: