Lyrics: ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా - Enno ratrulosthayi song lyrics in telugu
Lyrics: Enno Rathrulosthayi Kani..
పల్లవి : ఎన్నో రాత్రులొస్తాయి గానీ.. రాదీ వెన్నెలమ్మ ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ అన్నాడే చిన్నోడు.. అన్నిట్లో ఉన్నోడు.. ఆహా.. ఎన్నో రాత్రులొస్తాయి గానీ.. రాదీ వెన్నెలమ్మ ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మా..
చరణం 1 : ఎన్ని మోహాలు మోసీ.. ఎదలు దాహాలు దాచా పెదవి కొరికే.. పెదవి కొరకే.. ఓహోహో నేనిన్ని కాలాలు వేచా ఎన్ని గాలాలు వేశా మనసు అడిగే మరులు సుడికే.. ఓహోహో.. మంచం ఒకరితో అలిగినా.. మౌనం వలపులే చదివినా.. ప్రాయం సొగసులే వెతికినా.. సాయం వయసునే అడిగినా.. ఓ.. ఓ.. ఎన్నో రాత్రులొస్తాయి గానీ.. రాదీ వెన్నెలమ్మా.. ఎన్నో ముద్దిలిస్తారు గానీ.. లేదీ వేడి చెమ్మ.
చరణం 2 : గట్టి ఒత్తిళ్ల కోసం.. గాలి కౌగిళ్లు తెచ్చా తొడిమ తెరిచే.. తొనల రుచికే.. ఓహోహో నీ గోటి గిచ్చుళ్ల కోసం.. మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా చిలిపి పనుల.. చెలిమి జతకే.. ఓహోహో అంతే ఎరుగనీ అమరిక.. ఎంతో మధురమే బడలిక.. ఛీ పో బిడియమా సెలవిక.. నాకీ పరువమే పరువిక.. ఓ.. ఓ.. ఎన్నో రాత్రులొస్తాయి గానీ.. రాదీ వెన్నెలమ్మా.. ఎన్నో ముద్దిలిస్తారు గానీ.. లేదీ వేడి చెమ్మ.
చిత్రం : ధర్మక్షేత్రం(dharma Kshetram) (1992), (Remix in Amigos (2023)) రచన : వేటూరి, సంగీతం : ఇళయరాజా గానం : ఎస్.పి.బాలు, చిత్ర రీమిక్స్ గానం : ఎస్.పి. చరణ్, సమీరా భరద్వాజ్