కోనో కార్పస్ (Conocarpus Tree) అనే ఈ మొక్క మనకు దగ్గరలో ఉంటే ఎంత ప్రమాదకరమో తెలుసా? ప్రభుత్వాలు ఈ మొక్కని ఎందుకు నిషేధించాయి?


Conocarpus Plant

కోనో కార్పస్ (Conocarpus), ఇది చాలా ప్రమాదకరమైన మొక్క, మీ ఇంట్లో ఉంటే వెంటనే పీకేయ్యండి, మీ పక్కింట్లో ఉంటే వారికి ఈ మొక్క గురించి అవగాహన కల్పించండి.

శంఖు రూపం (కోన్ ఆకారం) లో పచ్చగా, అందంగా, ఆకర్షణీయంగా కనిపించే ‘కోనోకార్పస్’ మొక్కలు / చెట్లు రహదారులపైన డివైడర్లలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. నగరాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు చాలా దేశాలు గుబురుగా పెరిగే ఈ చెట్లను పెంచి పోషించాయి.

కోనో కార్పస్ అనే ఈ మొక్క పుప్పొడి (Pollen) వలన మనుషులకి శ్వాస సంబధిత సమస్యలు ఏర్పడుతాయి, అంతేకాదు ఈ చెట్టు ఉన్న పరిసరాలలో ఉన్న గాలిలో ఆక్సీజన్ లెవల్స్ తక్కువగా ఉంటాయి అని శాస్త్రవేత్తలు ధృవీకరించారు.

మరోటి మనం గమనించదగ్గ ముఖ్య విషయం ఏంటంటే ఈ చెట్టుపై సీతాకోక చిలుకలు కూడా వాలవు, ఈ చెట్టు పుప్పొడి అంతటి విషతుల్యం.

ఇవి సముద్ర తీరప్రాంతాల్లో పెరిగే మాంగ్రూవ్ జాతికి సంబందించిన మొక్క. దీని వేర్లు భూమి లోపలకి 80 మీటర్లకు పైగా వెల్తాయి, భూగర్బజలాలని పీల్చేస్తాయి. వేగంగా, ఎత్తుగా, పచ్చగా పెరిగే ఈ మొక్క ఒక వేల మీ ఇంటి పరిసరాలలో పెంచుకున్నట్లైతే, ఇది మీ ఇంటి పునాదులకి కూడా ప్రమాదం కలుగచేస్తుంది.

ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మన దేశంలోని చాలా రాష్ట్రాలు కూడా ఈ కోనో కార్పస్ మొక్కను బ్యాన్ చేసాయి.


Conocarpus

ఈ మొక్క వలన కలిగే నష్టాలు తెలియక మొదట్లో ప్రభుత్వం హరితహారంలో అత్యంత ఎక్కువగా నాటింది కూడా ఈ మొక్కనే. అటు ఒంటికి ఇటు ఇంటికి పనికి రాని మొక్క కావటం వలన ప్రభుత్వాలు కూడా ఇపుడు ఈ మొక్కని బ్యాన్ చేసాయి.

పాకిస్థాన్ లోని కరాచీలో ఆస్థమా పేషంట్ల సంఖ్య ఎక్కువగా ఉందని, అందుకు ఈ మొక్కలే కారణమని కరాచీ యూనివర్సిటీ బాటనీ విభాగం ఆధ్వర్యంలో చేసిన పరిశోధనలో తేలింది. దేశవాళీ చెట్లనే పెంచాలని అక్కడి వృక్షశాస్త్రవేత్తలు సూచించారు.

తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే ఈ మొక్కల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది.