పొన్నియిన్‌ సెల్వన్‌ 2` రివ్యూ


పొన్నియిన్‌ సెల్వన్‌ 2` రివ్యూ

నటీనటులు : విక్రమ్, 'జయం' రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, శోభితా ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి, ప్రకాష్ రాజ్, పార్తీబన్, ప్రభు, జయరామ్, విక్రమ్ ప్రభు, శరత్ కుమార్, రెహమాన్, లాల్, నాజర్, కిశోర్ తదితరులు కథ : కల్కి కృష్ణమూర్తి 'పొన్నియిన్ సెల్వన్' నవల మాటలు : తనికెళ్ళ భరణి (తెలుగులో) పాటలు : అనంత శ్రీరామ్ (తెలుగులో) ఛాయాగ్రహణం : రవి వర్మన్ సంగీతం: ఏఆర్ రెహమాన్ దర్శకత్వం : మణిరత్నం నిర్మాతలు : మణిరత్నం, సుభాస్కరన్ విడుదల : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ('దిల్' రాజు) (తెలుగులో) విడుదల తేదీ: ఏప్రిల్ 28, 2023

గతేడాది సెప్టెంబర్‌లో రిలీజ్ అయిన ‘పొన్నియిన్ సెల్వన్ 1’ తమిళనాట ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష వంటి భారీ స్టార్ట్ కాస్టింగ్‌, ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ మ్యాజిక్ ఈ సినిమాను బ్లాక్‌బస్టర్‌గా మార్చాయి. ప్రముఖ తమిళ రచయత కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు... 9 వ శతాబ్దం నాటి చోళుల కథ ఇది...పూర్తిగా తమిళుల కథ అవడం వాళ్ళ తెలుగు వాళ్లకి పెద్దగా ఎక్కలేదు మొదటి భాగం...భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 28 న ఈ సినిమా విడుదల అయింది,చూద్దాం ఈ భాగం ఎంత వరకు విజయం సాధిస్తుందో... మరి మణిరత్నం మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ హిట్ అయిందా?లేదా అనేది చూద్దాం...

కథ:

లంక నుంచి తిరిగి ఛోళారాజ్యానికి బయలు దేరే క్రమంలో అరుణ్‌ మోళి(పొన్నియిన్‌ సెల్వన్‌-జయం రవి), వల్లవరాయ(కార్తి)లపై రాణి నందిని పంపిన శత్రువులు సముద్రంలో దాడి చేస్తారు. దీంతో పొన్నియిన్‌, వల్లవరాయ నీటిలో మునిగిపోతారు,దీనితో మొదటి భాగం ముగుస్తుంది,అరుణ్ మౌళి కి ఎప్పుడు ఆపద వచ్చిన కూడా కాపాడే ముసలావిడ కూడా ఐశ్వర్య రాయ్ పోలికలు ఉన్నట్టు చూపించి మొదటి భాగాన్ని ముగిస్తాడు దర్శకుడు... అసలు ఆ ముసలావిడ ఎవరు,ముసలావిడకు నందిని పోలికలు ఎలా ఉన్నాయి,అరుణ్ మొళి ని ఆవిడ కాపాడిందా,ఆదిత్య కరికాలుడి ( విక్రమ్) మీద పగ పెంచుకున్న నందిని ఏంచేయబోతుంది,చాలా రాజ్యాన్ని అంతం చేయాలనీ చూస్తున్న పాండ్యుల లక్ష్యం నెరవేరుతుందా...ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానమే ఈ పొన్నియన్ సెల్వం 2 వ భాగం...

ఎలా ఉందంటే :

నందిని పోలికలు ఉన్న ఆ ముసలావిడ మరియు పొన్నియన్ సెల్వం సముద్రం లో మునుగినట్టు చూపించి మొదటి భాగాన్ని కొంత ఆసక్తిగా ముగించాడు దర్శకుడు,అలాగే పొన్నియిన్ సెల్వన్ చనిపోయాడని తన కుటుంబం పడే బాధ, ఇదే అదనుగా రాజ్యం కోసం శత్రువులు పన్నే పన్నాగాలు, మరోవైపు వందియ దేవుడు, పొన్నియిన్ సెల్వన్ తమను తాము కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాల మధ్య ఫస్టాఫ్ సాగుతుంది...రాజ్యాధికారం అంతిమ లక్ష్యం అనుకున్నప్పుడు కుటుంబం లో జరిగే కుతంత్రాలు,రాజ్యంపై శత్రువుల దండయాత్రలు,పగలు ప్రతీకారాలు ఇలా సాగుతుంది ఈ సినిమా కథాంశం...ఈ సినిమా పొన్నియన్ సెల్వం నవల ఆధారంగా నిర్మించడం వాళ్ళ చాలా రకాల పాత్రలు మరియు కథతో కొంత గందరగోళంగా ఉన్నప్పటికీ కథని అర్థం చేసుకున్న వాళ్లకి మంచి ఆసక్తిని పెంచుతుంది...

పాత్రలు పేర్లు విచిత్రంగా ఉండటంతో మొదటి భాగం చాలా వరకు అర్థం లేదు. దీంతో చాలా నెగటివిటీ వచ్చింది. దాన్ని దర్శకుడు మణిరత్నం దృష్టిలో పెట్టుకున్నట్టుంది. రెండో భాగంపై చాలా కేర్‌ తీసుకున్నారు. కథనాన్ని చాలా నీట్‌గా సాగేలా జాగ్రత్తలు పడ్డారు. కన్‌ ఫ్యూజన్‌కి తెరపడేలా కథ, కథనాలను తీసుకెళ్లాడు. దీంతో పాత్రల తీరుతెన్నులు, అవి సాగే తీరు, పాత్రల మధ్య సంఘర్షణ, కథ నడిచే తీరు మొదటి భాగంతో పోల్చితే చాలా వరకు ఆడియెన్స్ కి అర్థమయ్యేలా సాగుతాయి. `పీఎస్‌ 2` విషయంలో మణిరత్నం సక్సెస్‌ అయ్యారనే చెప్పాలి. అయితే మొదటి భాగం చూసిన వారికే రెండో భాగం అర్థమవుతుంది...

అరుణ్ మొళి సముద్రంలో మునిగి పోయిన తర్వాత చోళ రాజ్యంలో మరియు పాండ్య రాజ్యంలో చోటు చేసుకునే పరిణామాలు,సొంత రాజ్యంలో రాజ్యం కోసం జరిగే ఎత్తుగడలు,మందాకినీ ఎవరు అనే విషయం మీద జరిగే కొన్ని సన్నివేశాలు,అలాగే ఆదిత్య కరికాలుడు మరియు నందిని మధ్య జరిగే ఆసక్తికర సన్నివేశాలతో సినిమా ఆసక్తిగా సాగుతుంది...తొలి భాగం కేవలం పాత్రలను చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు ఈ భాగంలో మాత్రం కాస్త లోతుగా వెళ్లడం జరిగింది...మొదటి భాగం లో వల్లవరాయుడు చేసే అల్లరి పనులు మరియు కొన్ని సాహసాలతో సాగుతుంది,ఈ భాగంలో కూడా ఇతని పాత్ర కీలకమే...ఆదిత్య కరికాలుడు, నందినిల చిన్ననాటి ప్రేమ కథ స్క్రీన్‌పై అందంగా కనిపిస్తుంది...

పొన్నియిన్ సెల్వన్ తమను తాము కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాల మధ్య ఫస్టాఫ్ సాగుతుంది,సెకండాఫ్‌లో నందిని మరియు ఆదిత్య కరికాలుడి మధ్య వచ్చే సన్నివేశం అద్భుతంగా తెర మీదకు వచ్చింది. అలాగే నందిని పాత్రకు సంబంధించిన ట్విస్టులు బాగా వర్కవుట్ అవుతాయి...చివర్లో వచ్చే యుద్ధ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు...

నటి నటులు & సాంకేతిక వర్గం పని తీరు:

ఇలాంటి సినిమాల్లో తప్పకుండ ప్రతి పాత్ర కీలకమే...కాకపోతే కొన్ని పాత్రలకు మాత్రమే నటనకి ప్రాధాన్యత ఉంటుంది అలాగే నిడివి కూడా ఎక్కువ ఉంటుంది...సెకండ్ పార్ట్ లో విక్రమ్ మరియు ఐశ్వర్య రాయ్ పాత్రలకి కొంత ఎక్కువ ప్రాధాన్యత ఉంది,ఐశ్వర్య రాయ్ రెండు షేడ్స్ ఉన్న పాత్ర లో చక్కగా నటించింది,అలాగే విక్రమ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, పాత్ర ఎంత ఉంది అనేది కాకుండా ఉన్నంత వరకు బెస్ట్ ఇచ్చారు...వీళ్ళ ఇద్దరి మధ్య ఉన్న ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి...కార్తీ మరియు జయం రవి వారి పాత్రలకి న్యాయం చేసారు,ఇక త్రిష తన అందం మరియు అభినయం తో ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది...ఐశ్వర్య లక్ష్మి,శోభిత ధూళిపాళ్ల,విక్రమ్ ప్రభు తదితరులు వారి వారి పాత్రల మేరకు నటించారు...

రెహ్మాన్ గారి సంగీతం అద్భుతంగా ఉంది,నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది,రవివర్మన్ కెమెరా పనితనం అద్భుతం అని చెప్పాలి...ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి,కాకపోతే చాలా సన్నివేశాల vfx అంతగా ఆకట్టుకోదు,బాహుబలి లాంటి సినిమా చూసిన తర్వాత ఈ సినిమాలో సన్నివేశాలు & యుద్ధ సన్నివేశాలు చాలా నార్మల్ అనిపిస్తాయి...ఇక దర్శకుడు తన మార్క్ సినిమాని చూపించారు,ప్రేక్షకులని ఖచ్చితంగా 9 శతాబ్దంలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరిగింది...

చివరగా :

మొదటి భాగంతో పోలిస్తే ‘పొన్నియిన్ సెల్వన్ 2’ కచ్చితంగా మంచి సినిమానే. కానీ సెకండాఫ్ మీద మరింత కాన్సన్‌ట్రేట్ చేసి ఉంటే మంచి సినిమా అయి ఉండేది. హిస్టారికల్ కథలను ఇష్టపడేవారు మాత్రం కచ్చితంగా చూడతగ్గ సినిమా... మణి రత్నం మ్యాజికల్ మూవీ అని చెప్పొచ్చు...

రేటింగ్ : 3.0/5.0