కోర్టులలో కేసుల జాప్యానికి కారణం ఏమిటి? వాటిని తగ్గించే మార్గం ఏమిటి?
కోర్టులలో కేసుల జాప్యానికి కారణం ఏమిటి? వాటిని తగ్గించే మార్గం ఏమిటి?
భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు అనేకమైన విషయాలలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటారు, మరి దేశంలో ఇంత పెద్ద ఎత్తున కేసుల పెండింగ్ గురించి గాని, ఇంత పెద్ద ఎత్తున కేసులు ఎందుకు పెండింగ్లో ఉంటున్నాయని గాని ఆలోచించారా? కేవలం సిబ్బంది మాత్రమే లేకపోవడం కారణమా, మరి ఇంకా ఏదైనా కారణం వుందా?
మనము ఓ సారి పరిశీలిస్తే సుప్రీం కోర్టు, హైకోర్టులలో గాని కేసులు రిట్ల రూపంలో గాని, ఇతర కేసుల రూపంలో గాని ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. కోర్టులకు వచ్చే కేసుల కంటే పరిష్కరించబడే కేసులు చాలా తక్కువగా ఉండటమే కారణం అనేది అందరికీ తెలుసు. ప్రస్తుతం ఆర్థికంగా ఎదుగుతున్న సమాజంలో కేసులు పెరగడం సహజమే. దేశములో అత్యున్నత న్యాయస్థానం ఏదైనా ఒక కేసులో తీర్పు చెప్పిన యెడల ఆ కేసు సహజ సూత్రం దేశంలో ఉన్న అన్ని కేసులకు వర్తించాలి, అన్వయించాలి కూడాను. అలా కాకుండా ఏ కేసుకు ఆ కేసులు చూడడం వల్ల సమస్య అదే సరి అయినను అధికారుల నిర్లక్ష్యం వల్ల మరల మరల అదే న్యాయ సూత్రం కొరకు రిట్లు లేదా కేసులు దాఖలు చేస్తున్నారు.
రెవెన్యూ అధికారులు ఎప్పటినుంచో సాగులో కొనసాగుతున్న పట్టా భూములను కూడా భూముల రేట్లు విపరీతంగా పెరగడం వల్ల దానిని అవకాశంగా తీసుకుని పట్టా భూములను కూడా చుక్కల పేరుతో ప్రభుత్వ భూములని అనేక రకాల ఇబ్బందులకు గురిచేస్తూ రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ అధికారులు మాత్రం ఎన్ ఓ సి రెవెన్యూ అధికారుల నుండి ఉంటే చేస్తామంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
రాష్ట్రంలో అనేక మంది రైతులు ఇలాంటి చర్యలపై హైకోర్టును ఆశ్రయించడం జరిగింది, జరుగుతుంది కూడాను. తదుపరి కోర్టు వారు ఈ సమస్య తీవ్రతను గమనించి దీనిపై సమగ్రముగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా దీనిని అమలు పరుస్తున్న దాఖలాలు కూడా లేవు. ఇంత సమగ్రంగా హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఇదే విషయంపై ఇంకా కేసులు దాఖలు చేస్తూనే ఉన్నారు. దీనివలన కోర్టుల మీద విపరీతమైన భారం పడుతుంది. అంతేకాకుండా మిగతా కేసుల జాప్యం కక్షిదారులకు అనవసర కాలయాపన మరియు ఆర్థిక భారం పెరుగుతుంది.
అసలు సమస్యకు కారణమైన అధికారుల మీద చర్యలు తీసుకున్నట్లయితే కొంతవరకైనా పరిష్కారం దొరుకుతుంది. అటువంటి చర్యలు లేనంతవరకూ కోర్టులపై ఈ భారం తప్పదు. ఇంత పెద్ద ఎత్తున నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులను ఎందుకు క్షమించి వదిలేస్తున్నట్లు? అధికారుల నిర్లక్ష్యం వలన సామాన్యులు బలైపోతున్నారు. అంతేకాకుండా సత్వర న్యాయం అందాల్సిన మిగిలిన కక్షిదారులకు కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది. తప్పు ఒకరిది శిక్ష మరొకరికి అన్న చందముగా వ్యవస్థ తయారైంది.
చట్టాలు ఎంత బాగున్నా అమలు తీరు సరిగా లేక ప్రతి చిన్న విషయాన్ని కోర్టులను సంప్రదించడం మరీ దారుణం. అధికారుల తప్పులకు బలౌవుతున్నది సామాన్యులు మాత్రమే.
రెవెన్యూ చట్టాలు ఎంత బాగున్నను అధికారుల నిర్లక్ష్యం వల్ల పూర్తిగా నాశనం అయ్యాయి. ఇందులో భాగంగా పట్టాదారు పాసు బుక్ చట్టాన్ని అతి దారుణంగా నాశనం చేస్తున్నారు. అధికారులు కనీసం చట్టాలను గౌరవించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వ్యాజ్యాలకు కారణబూతులౌతున్నారు.
అసలు తప్పు చేస్తున్న అధికారులను శిక్షించక పోవడం వలన వ్యాజ్యాలు విపరీతంగా పెరుగుతున్నాయి. వాటికి తోడు సరైన సిబ్బంది లేక లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. అందువలన సామాన్యులకు వేరే గత్యంతరం లేక రాజకీయ నాయకులను, గూండాలని, పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పెద్ద ఎత్తున సెటిల్మెంట్ చేస్తూ కోట్లకు కోట్లు పడగెత్తుతున్నారు. వీరి జోక్యం వలన మాఫియాలకు రాజకీయ వ్యవస్థ తోడై మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది.
ఒక వ్యక్తి భూమి కబ్జాకు గురయినచో ఆ బాధితుడు ఒక న్యాయవాదిని సంప్రదించి నా భూమి నాకు ఇప్పించండి. కావాలంటే సగము మీరు తీసుకోండి అంటే మనం చేయగలమా? చేయలేము అంటాము. అదే మాఫియా గాని రాజకీయ నాయకులు గాని అయితే రాత్రికి రాత్రే ఈ సమస్యకు పరిష్కారం చూపించగలరు అనే నమ్మకం ప్రస్తుత సమాజంలో ఉంది. అందుకే గత్యంతరం లేని పరిస్థితుల్లో కోర్టులకు వస్తున్నారు తప్ప న్యాయాన్ని ఆశించి కాదు.
అందువల్ల రాజకీయ నాయకుడు కోర్టుల నుంచి సత్వర న్యాయం అందిస్తారనుకోవడం భ్రమే అవుతుంది. ఉన్న కోర్టులలోనే సుమారు 30 శాతం పైగా ఖాళీలతో ఉన్నాయి. అయినా పట్టించుకోరు. న్యాయం ఎంత త్వరగా జరిగితే నష్టపోయేది మన రాజకీయ నాయకులే కాబట్టి. అసలు తప్పు చేసేది ఎవరు శిక్ష ఎవరికి విధిస్తున్నారు.
ఒక రైతు పేరున పట్టాదారు పాసుపుస్తకం మరియు హక్కు పుస్తకంలో ఉన్న పేరు ఎటువంటి సమాచారం లేకుండా తొలగిస్తూ అదే పుస్తకాన్ని వేరొకరి పేరు మీద మార్చివేస్తున్నారు అధికారులు. అటువంటప్పుడు సదరు బాధితుడు సంబంధిత కోర్టులో వ్యాజ్యం దాఖలైనప్పుడు స్పష్టంగా విధి నిర్లక్ష్యం ఉన్ననూ కేవలం నిర్లక్ష్యం వహించిన అధికారిని అధికారికంగా సరి చేయమని ఆదేశాలు జారీ చేస్తారు. దీనివల్ల బాధితుడికి న్యాయం జరగకపోగా, తప్పు చేసిన అధికారికి శిక్ష లేకపోగా బాధితుడు మరలా అధికారుల చుట్టూ తిరుగుతూ సంవత్సరాలకు సంవత్సరాలు నష్టపోతూ మరలా ఇంకొక జాప్యం చేస్తూ కాలం వెళ్ళ వలసిన పరిస్థితి ఏర్పడింది. అదే తప్పు చేసిన అధికారిపై బాధితుడికి జరిగిన నష్టాన్ని సదరు అధికారులపై విధించి బాధితులకి న్యాయం చేయగలిగితే కేసుల సంఖ్య తగ్గి కోర్టులకు కూడా సత్వర న్యాయం చేసేటట్టుగా వెసులుబాటు ఉంటుంది. ఆ విధముగా కాకున్నట్లయితే కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ తప్పు చేసే అధికారులకు వరంగా మారుతూ, న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లి సమాజం సత్వర న్యాయం కోల్పోయి మాఫియా చేతుల్లోకి వెళ్లి పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇకనైనా ఆలోచించి న్యాయం జరిగే ఏర్పాటు చేసే విధంగా.