Quotes: నీ ఎదుగుదల చూసి ఈర్ష్య పడినవారే నీ సాయం కోరతారు. కావలసిందల్లా ఒక్క ఓపిక మాత్రేమే.

సహనం నీదైతే, గెలుపు కూడా నీదే!

"విత్తనం" మట్టిలో ఉండగానే "చీమలు", "పురుగులు" తినేయాలని చూస్తాయి.

వాటిని తప్పించు కొని మొలకెత్తుతూ ఉంటే "పక్షులు" దాన్ని "పసిగట్టి" పొడిచి "తినేయా"లని చూస్తాయి.

తరువాత అది పెరుగుతూ ఉంటే "పశువులు" దాని పని పట్టబోతాయి.

ఐనా అది తట్టుకొని ఎదిగి వృక్షంలా మారితే ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న ఆ జీవులన్నీ దాని నీడలోనే తల దాచుకుంటాయి.

అదేవిధంగా నీ ఎదుగుదల చూసి ఈర్ష్య పడినవారే నీ సాయం కోరతారు, అప్పటివరకు కావలసిందల్లా ఒక్క ఓపిక మాత్రేమే.

ఆ సహనం నీ దగ్గర ఉంటే నీవు ఏ రంగంలో నైనా రాణిస్తావు. అంతిమంగా గెలుపు నీదే.👍


Success

మనం పుడితే తల్లి "సంతోష"పడాలి.

మనం పుడితే తల్లి "సంతోష"పడాలి.

పెరిగితే తండ్రి "ఆనంద"పడాలి.

బ్రతికితే సమాజం "గర్వ" పడాలి.

చస్తే స్మశానం కూడా "కన్నీరు" పెట్టాలి.

అదే జీవితం.

ఒకరి గురించి ఇంకొకరికి చెడుగా చెప్పేవారు... వాళ్ళని వాళ్ళు హత్య చేసుకున్నట్లే.

అందుకే... ఆచరించండి...

మన నోటిలోకి పోయే ఆహారం ఎంత రుచిగా ఉండాలో...

మన నోటినుండి వచ్చే మాటలు కూడా అంతే రుచిగా ఉండాలి, అప్పుడే బంధాలు స్నేహాలు బలపడుతాయి.