శ్రీమద్రామాయణం - మానవీయ ధర్మాలు - 01


శ్రీమద్రామాయణం - మానవీయ ధర్మాలు

రామాయణములో శ్రీరామచంద్రమూర్తి పుష్పక విమానము నుంచి దిగుతూ ఉంటే భరతుడు పరుగెత్తుకుంటూ వెళ్ళి, అన్నయ్యా! చెప్పులు వేసుకోమని పాదుకలు పెట్టాడు.

శతృఘ్నడు చామరము పడితే విభీషణుడు, సుగ్రీవుడు ఇద్దరూ నొచ్చుకున్నారు.

సుగ్రీవుడు నాకూ చాలా పౌరుష పరాక్రమములు ఉన్న అన్నగారు మహా బలవంతుడు, గొప్ప తేజోమూర్తి, ఇంద్రుని అంశతో జన్మించినవాడు వాలి ఏడీ ఇవ్వాళ? నేనే చంపించాను. మా అన్నదమ్ములము కలసి బ్రతక లేకపోయాము అనుకున్నాడు.

విభీషణుడు నాకూ ఇద్దరు అన్నలు ఉన్నారు. రావణాసురుడు వేదము చదువుకున్నాడు. ఇంద్రజిత్ వంటి కొడుకుని పొందాడు దేవలోకమును గెలిచాడు ఏడీ ఇవ్వాళ? కుంభకర్ణుడు లేడు. ఒక్కడిని మిగిలాను. శ్రీరాముని అన్నదమ్ములు నలుగురూ ఎంత ప్రేమగా ఉన్నారో అనుకున్నాడు.