ఇండోర్ టెస్టులో తడబడుతున్న టీమిండియా


India VS Australia: Border-Gavaskar Trophy 3rd Test

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ (Indore) వేదికగా ఈరోజు ప్రారంభమైన మూడో టెస్టులో భారత్ జట్టు తొలి సెషన్‌లోనే వరుసగా వికెట్లు కోల్పోయింది. తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా స్పిన్నర్లని సమర్థంగా ఎదుర్కొన్న టీమిండియా బ్యాటర్లు ఈరోజు అనూహ్యరీతిలో అవుట్ అయ్యారు.

ఇటీవల నాగ్‌పూర్, ఢిల్లీ వేదికగా జరిగిన తొలి రెండు టెస్టుల్లో చక్కగా ఆడి రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన టీం ఇండియా, అదే ఊపులో మూడవ టెస్టు మొదలవగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు తొలి సెషన్ ముగిసే సమయానికి 84/7తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది.

అప్పటికి క్రీజులో ఉన్న అక్షర్ పటేల్ & రవి చంద్రన్ అశ్విన్ ఒక చక్కటి భాగస్వామ్యం నెలకొల్పుతారు అని భావించినప్పటికీ 29 వ ఓవర్ లోనే 3 ( 12 ) పరుగులకు అవుట్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన ఉమేష్ ధాటిగా ఆడడానికి ప్రయత్నిచినా ఫలితం దక్కలేదు, ఇన్నింగ్స్ 33 వ ఓవర్ లో ఉమేష్ యాదవ్ 17 (13) అవుట్ అవ్వగా, క్రీజులోకి వచ్చిన సిరాజ్ డక్ అవుట్ అయ్యాడు.

ఫైనల్ గా మొదటి ఇన్నింగ్స్ లో ఇండియా 109 పరుగులకే అల్ అవుట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్ కుహనామన్ 5 వికెట్స్ తీసి కేవలం 16 పరుగులు ఇచ్చి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు, నాథన్ లయన్ 3 వికెట్లు & ముర్ఫి ఒక వికెట్ తీయడం జరిగింది.

ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండవ ఓవర్లో అల్ రౌండర్ రవీంద్ర జడేజా బౌలింగ్ లో ఓపెనర్ హెడ్ 9(6) పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లాబుచ్చనే & ఉస్మాన్ ఖవాజా ధాటిగా ఆడారు.. ఆస్ట్రేలియా స్కోర్ 108 పరుగుల వద్ద ఉండగా ఇంకోసారి జడేజా 35 వ ఓవర్లో లాబుచ్చనే 31(91) ని అవుట్ చేసాడు. ఆ తర్వాత జడేజా మరోసారి 43 మరియు 49 ఓవర్లో ఖవాజా & స్మిత్ అవుట్ అయ్యారు.

మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 156 /4 స్కోరుతో ఉంది.