Lyrics: జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా.. Jamurathiri jabilamma song lyrics in telugu - Kshana Kshanam


Jamu rathiri jabilamma song lyrics in telugu

పల్లవి: జామురాతిరి.. జాబిలమ్మ జోలపాడనా.. ఇలా జోరుగాలిలో.. జాజికొమ్మ జారనీయకే.. కలా వయ్యారి వాలుకళ్ళలోనా వరాల వెండిపూల వాన స్వరాల ఊయలూగువేల జామురాతిరి.. జాబిలమ్మ జోలపాడనా.. ఇలా..

చరణం 1: కుహు కుహు.. సరాగాలే శ్రుతులుగా కుశలమా.. అనే స్నేహం పిలువగా కిల కిలా.. సమీపించే సడులతో ప్రతి పొద.. పదాలేవో పలుకగా కునుకురాక బుట్ట బొమ్మ గుబులుగుందనీ వనము లేచి వద్దకొచ్చి నిద్రపుచ్చని

జామురాతిరి.. జాబిలమ్మ జోలపాడనా.. ఇలా..

చరణం 2: మనసులో.. భయాలన్నీ మరిచిపో మగతలో.. మరోలోకం తెరుచుకో కలలతో.. ఉషాతీరం వెతుకుతూ నిదురతో.. నిశారాణి నడిచిపో చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికీ

జామురాతిరి.. జాబిలమ్మ జోలపాడనా.. ఇలా.. జోరుగాలిలో.. జాజికొమ్మ జారనీయకే.. కలా వయ్యారి వాలుకళ్ళలోన మ్మ్ హ్మ్ మ్మ్ హ్మ్ హా హా స్వరాల ఊయలూగువేల

హాహ హాహహా తాన నానా మ్మ్ హ్మ్ హ్మ్ ఆహా తానతనననా తాని నానా హ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ ఆహా హ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ ఆహా

వీక్షించండి: